కుటుంబానికి ఆర్థిక భద్రత ఎంతో అవసరం. ఆపదలు చెప్పి రావు కదా. నేడు పొదుపు చేసే ప్రతి రూపాయి ఆర్థిక అత్యవసర పరిస్థితుల్లో ఆదుకుంటుంది. అప్పుల ఊబిలో చిక్కుకోకుండా కాపాడుతుంది. అందుకే చాలా మంది జీవిత బీమా పాలసీలు, ప్రమాద బీమా పాలసీలను తీసుకుంటున్నారు. అయితే కొందరు ప్రీమియం ఎక్కువ కాట్టాల్సి వస్తుందేమో అని పాలసీ తీసుకునేందుకు వెనకాడుతుంటారు. ఇలాంటి వారికోసం పోస్టాఫీస్ అద్భుతమైన ప్రమాద బీమా స్కీమ్ ను అందిస్తోంది. రోజుకు కేవలం రూ. 2 పొదుపు చేస్తే చాలు.. రూ. 15 లక్షల ప్రమాద బీమా పొందొచ్చు. మరి దీనికి అర్హులు ఎవరు? ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం.
Also Read:Shubhanshu Shukla: రేపు భారత్‌కు రానున్న వ్యోమగామి శుభాంశు శుక్లా
రూ.755 ప్రీమియం పాలసీ
హెల్త్ ప్లస్ పాలసీ కింద తపాలా శాఖ అందిస్తున్న ప్రీమియం పాలసీ. కేవలం రూ.755 సంవత్సరానికి చెల్లిస్తే చాలు, రూ.15 లక్షల కవరేజి లభిస్తుంది. నెలకు కేవలం రూ.62 చెల్లిస్తే సరిపోతుంది. అంటే దాదాపు రోజుకు రూ. 2 అన్నమాట. ఈ ప్రీమియం ద్వారా ప్రమాదం జరిగిన సందర్భంలో మరణం, శాశ్వత వైకల్యం వంటి సందర్భాల్లో పూర్తి కవరేజి పొందే ఛాన్స్ ఉంటుంది. పిల్లల వివాహాల కోసం కవరేజీ అందుకోవచ్చు. అలాగే యాక్సిడెంటల్ మెడికల్ రీయింబర్స్‌మెంట్ రూ. లక్ష, ఎముకలు విరిగిన సమయాల్లో రూ. 25 వేల వరకు లబ్ధి పొందే అవకాశం ఉంటుంది.
Also Read:Akhanda 2 : డ్రగ్స్‌పై బాలయ్య వార్.. బోయపాటి స్టైల్‌లో మాస్ ట్రీట్మెంట్!
పాలసీ దారు ఒకవేళ ఆసుపత్రిలో చేరితే వైద్య ఖర్చుల కోసం లక్ష రూపాయలు ఇస్తారు. ఆసుపత్రిలో, సాధారణ చికిత్స సమయంలో రోజుకు రూ.1000, ఐసీయూలో ఉంటే రోజుకు రూ.2 వేలు చెల్లిస్తారు. పాలసీదారు చేయి, కాలు విరిగిపోతే, బీమా కవరేజ్ కింద రూ.25,000 చెల్లిస్తారు. రోజుకు రూ. 1.50తో రూ. 10 లక్షల బీమా పొందొచ్చు. ఏడాదికి రూ. 549 ప్రీమియంతో అకాల మరణాలకు రూ.10 లక్షలు అందిస్తోంది. 18-65 ఏళ్ల వయసున్న వారు ఎవరైనా పోస్టాఫీస్ ప్రమాద బీమా పాలసీ తీసుకోవచ్చు. ఈ పాలసీలకు సంబంధించిన పూర్తి సమాచారం కోసం దగ్గర్లోని పోస్టాఫీస్ బ్రాంచ్ ను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు.
