Amaravathi: అమరావతిని గ్రీన్ అండ్ రెసిలియంట్ సిటీగా మలచడం కోసం యోకోహామాతో సిటీ-టు-సిటీ భాగస్వామ్యాన్ని కుదుర్చుకునేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. ఆంధ్రప్రదేశ్ బృందం యోకోహామా నగరంలో “క్లైమేట్ యాక్షన్, స్మార్ట్ అర్బన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, సిటీ మేనేజ్మెంట్‌లో టెక్నాలజీ వినియోగం, ఆర్థిక అభివృద్ధి” నమూనాలను కూడా అధ్యయనం చేస్తోంది. ఇందులో భాగంగా హోకుబు స్లడ్జ్ ట్రీట్‌మెంట్ ప్లాంట్‌ను మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ప్రధాన కార్యదర్శి సురేష్ కుమార్ బృందం యోకోహామా సిటీలో ఐదు రోజుల అధ్యయన పర్యటనలో ఉన్నారు. ఈ పర్యటనలో వర్షపు నీరు, మలిన జలాలు, డ్రైనేజ్ మేనేజ్మెంట్ కోసం యోకోహామా కంట్రోల్ సెంటర్‌ను కూడా పరిశీలన చేశారు.
Drunk Driving: మద్యం మత్తులో లవర్తో బెట్టింగ్.. సముద్రంలోకి కారు.. చివరకు?
యకోహోమాను జపాన్‌లో ప్రధాన వృద్ధి కేంద్రంగా ఎలా మలిచారో దాని విజన్‌ను ఆరు ప్రధాన ప్రాజెక్టుల మాస్టర్‌ప్లాన్‌గా అమలుచేసిన విధానాన్ని జపాన్ ప్రతినిధులు వివరించారు. విభాగాల మధ్య సమన్వయం, ముఖ్యంగా రవాణా మరియు నగరాభివృద్ధి సమన్వయం, అర్బన్ డిజైన్ అంశాలపై దృష్టి, ప్రైవేట్ రంగం సహకారాన్ని అర్బన్ డెవలప్మెంట్‌లోకి తీసుకురావడం వంటి అంశాలే యోకోహామా ఏర్పాటుకు కీలకం అనే దిశగా చర్చ జరిగింది.
Vijayawada Diarrhea: విజయవాడలో డయేరియా విజృంభణ.. 100 దాటిన కేసులు!
1,800 గ్లోబల్ కంపెనీల కార్యాలయాలు ఉన్న యోకోహామా, పరిశోధకులకు, ఇంజినీర్లకు ఉత్తమమైన వ్యాపార వాతావరణ కేంద్రంగా ఉండడం పై ఏపీ అధికారుల దృష్టి సారించనున్నారు. యోకోహామా తమ సొంత అర్బన్ డెవలప్మెంట్ మోడల్‌పై ఆధారపడి, నగర ప్రణాళిక నుంచి ఆపరేషన్ వరకు విస్తృత సేవలను అందించడానికి ఆసక్తి చూపుతోంది. సిటీ-టు-సిటీ భాగస్వామ్యానికి యోకోహామా సమగ్ర అర్బన్ డెవలప్మెంట్ ప్లాన్ మరియు అర్బన్ డిజైన్ అమలుపై దృష్టి పెట్టింది. ప్రైవేట్ రంగ పెట్టుబడులు, ఆవిష్కరణలను ప్రోత్సహించడానికి “సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్, మలిన జలాలు, స్లడ్జ్, ట్రాఫిక్ మేనేజ్మెంట్, పవర్ డిస్ట్రిబ్యూషన్ మేనేజ్మెంట్, పునరుత్పాదక ఇంధనం కోసం స్మార్ట్ టెక్నాలజీ అందించడానికి చర్చలు జరపనున్నారు.
