NTV Telugu Site icon

New York: న్యూయార్క్ లో యోగా దినోత్సవం..హాజరైన పది వేల మంది జనం

New Project (7)

New Project (7)

అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని భారతదేశంతో సహా ప్రపంచంలోని అనేక దేశాల్లో ప్రతి సంవత్సరం జూన్ 21న జరుపుకుంటారు. భారత ప్రధాని నరేంద్ర మోడీ 27 సెప్టెంబర్ 2014న ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీలో యోగా దినోత్సవాన్ని జరుపుకోవాలని ప్రతిపాదించారు. ఈ ప్రతిపాదనకు 177 దేశాల మద్దతు లభించింది. యోగా శారీరకంగానే కాకుండా మానసిక ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. ప్రపంచ వ్యాప్తంగా యోగా ప్రాముఖ్యతను తెలిపేందుకు యోగా దినోత్సవాన్ని నిర్వహిస్తారు. ఈరోజు ప్రధాని మోదీ శ్రీనగర్‌లో యోగా చేశారు. అంతర్జాతీయ యోగా దినోత్సవానికి ముందు గురువారం రోజు న్యూయార్క్ నగరంలోని ‘సొల్స్టిస్ ఎట్ టైమ్స్ స్క్వేర్’లో యోగా దినోత్సవం నిర్వహించారు. టైమ్స్ స్క్వేర్‌లో జరిగిన వేడుకల్లో పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. న్యూయార్క్‌లోని భారత కాన్సుల్ జనరల్ బినయ ప్రధాన్ పాల్గొని ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి హాజరైన ప్రతి ఒక్కరిని అభినందించారు. యోగా వల్ల కలిగే శారీరక ఆరోగ్యం, ఆధ్యాత్మిక శ్రేయస్సు, మానసిక ప్రశాంతత గురించి వారికి వివరించారు.

READ MORE: CM Revanth Reddy: కాంగ్రెస్​ లోకి రండి.. పోచారంను ఆహ్వానించిన సీఎం రేవంత్​

న్యూయార్క్‌లోని భారత కాన్సుల్ జనరల్ బినయ ప్రధాన్ మాట్లాడుతూ.. “ఈ రోజు మనం టైమ్స్ స్క్వేర్‌లో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జరుపుకుంటుము. యోగాలో పాల్గొనేందుకు అనేక దేశాల నుంచి ఔత్సాహకులు వస్తారు. రోజంతా యోగా కొనసాగుతోంది. ఈ రోజు యోగా చేసేందుకు 8,000 నుంచి 10,000 మంది హాజరయ్యారు. ఈ సంవత్సరం యోగా దినోత్సవం థీమ్ యోగా ఫర్ సెల్ఫ్ అండ్ సొసైటీ కావడం సంతోషంగా ఉంది. ఇక్కడ మరియు యునైటెడ్ స్టేట్స్‌లోని ఇతర వివిధ ప్రాంతాల్లో పెద్ద సంఖ్యలో యోగా చేసేందుకు జనాలు ఉత్సాహం కనబరుస్తారు.” అని పేర్కొన్నారు.