Site icon NTV Telugu

Yennam Srinivas Reddy : విచారణ జరుగుతుంటే లీగల్ నోటీసులు పంపిస్తారా..?

Yennam Srinivas Reddy

Yennam Srinivas Reddy

కేటీఆర్.. లీగల్ నోటీసులు పంపారని, కేటీఆర్.. నీకు లా.. అడ్మినిస్ట్రేషన్ అవగాహన ఉందా..? అని అన్నారు ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఇంటలిజెన్స్ అధికారుల అరెస్ట్ లు జరుగుతున్నాయని, తెలంగాణ వ్యాప్తంగా వార్ రూమ్ లు పెట్టి ఫోన్ ట్యాప్ చేశారు అని అరెస్ట్ చేస్తున్నారన్నారు. కల్వకుంట్ల కుటుంబంకి.. పెయిడ్ జర్నలిజం మాత్రమే తెలుసు అని ఆయన విమర్శించారు. . నా ఫోన్ ట్యాప్ చేశారు.. దీని వెనకాల బాద్యులు ఎవరని తేల్చండి అని ఫిర్యాదు చేయడం తప్పా..? అని ఆయన ప్రశ్నించారు. కేటీఆర్‌ రెచ్చిపోయి.. లీగల్ నోటీసులు పంపాడని, విచారణ చేయండి అని అడిగితే లీగల్ నోటీసు ఎందుకు అని ఆయన ప్రశ్నించారు. విచారణ జరుగుతుంటే లీగల్ నోటీసులు పంపిస్తారా..? అని ఆయన మండిపడ్డారు. ఇంత ఇంగిత జ్ఞానం లేదా..? విచారణ చేయండి అంటే పరువు తీసినట్టా..? అని ఆయన ధ్వజమెత్తారు.

ఇంటలిజెన్స్ అధికారుల అరెస్ట్ చేశారు అంటే ఆధారాలు ఉన్నట్టే కదా..? అని, మేనేజ్మెంట్ కోటాలో రాజకీయం చేశారు కాబట్టి ఇట్లనే ఉంటదన్నారు యెన్నం శ్రీనివాస్‌ రెడ్డి. నేనే కేటీఆర్ స్థానంలో ఉంటే.. డీజీపీ కి లేఖ రాసి..నిజాలు నిగ్గుతేల్చండి అని అడిగే వాణ్ణి అని, లీగల్ నోటీసులు పంపి బెదురించాలి అనుకుంటున్నారూ.. డీజీపీ కి కూడా పంపండి.. విచారణ ఎందుకు చేస్తున్నారు అని ఆయన వ్యాఖ్యానించారు. ఎన్నికల్లో ఎవరెవరికి ఎంత డబ్బులు పంపారో టాస్క్ ఫోర్స్ వాళ్లే చెప్పారన్నారు. కేటీఆర్‌కి తెలియదు అంటే.. ఆయన వర్కింగ్ ప్రెసిడెంట్ గా అన్ ఫిట్ అన్నారు. ప్రభుత్వ యంత్రంగా ని డబ్బులు పంపడం కోసం వాడినందుకు… బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల అందరిపై అనర్హత వేటు పడుతోందని, లీగల్ నోటిసులు రేవంత్ రెడ్డి ఇవ్వాలి కానీ ఇవ్వమన్నారు. ఎందుకంటే మేము మెరిట్ కోటా లో వచ్చాం.. మీలాగా మేనేజ్మెంట్ కోటా లో రాలేదు అని ఆయన అన్నారు.

Exit mobile version