NTV Telugu Site icon

Yennam Srinivas Reddy : కాంగ్రెస్ ప్రభుత్వం ఏ మంచి పని చేసినా హరీష్ రావుకి నచ్చట్లేదు

Yennam Srinivas Reddy

Yennam Srinivas Reddy

కాంగ్రెస్ ప్రభుత్వం ఏ మంచి పని చేసినా హరీష్ రావుకి నచ్చట్లేదని మహబూబ్‌ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. హరీష్ రావు ఇరిగేషన్ మంత్రిగా ఉండీ భవిషత్తును దృష్టిలో పెట్టుకొని ఏ మంచి కార్యక్రమం చేయలేదన్నారు ఎమ్మెల్యే శ్రీనివాస్‌ రెడ్డి. తెలంగాణ లో 90 శాతం చెరువులను కబ్జా చేసింది బీఆర్ఎస్ నాయకులే అని, నేను ప్రూవ్ చేయడానికి సిద్ధమన్నారు ఆయన. ఆ పాపం అప్పుడు ఇరిగేషన్ మంత్రిగా ఉన్న హరీష్ రావు దే అని, మామా అల్లుళ్ళకు సుఖర ముఖం శిక్ష పడటం ఖాయం ,తప్పించుకోలేరన్నారు ఎమ్మెల్యే శ్రీనివాస్‌ రెడ్డి. శిక్ష నుండి తప్పించుకోవడానికే హహరీష్ రావు దేవుళ్ళ దగ్గరకు పోతుండని, హైదరాబాద్ లో చెరువుల ఆక్రమణలను తొలగించడానికి సీఎం రేవంత్ రెడ్డి హైడ్రా తెచ్చిండన్నారు.

Mahesh Vs Pawan: ‘గబ్బర్ సింగ్‌’ను కొట్టేలా ఏడాది ముందు నుంచే ప్లానింగ్?

అంతేకాకుండా..’కేటీఆర్ కేవలం ట్విట్టర్ లో లొల్లి పెట్టడానికే పనికొస్తడు. కేటీఆర్ తొందరపడి మాట్లాడి తర్వాత క్షమాపణ చెప్పడంలో గిన్నిస్ బుక్ రికార్డ్ లకు ఎక్కిండు. వరంగల్ లో బీభత్సం జరగడానికి కారణం చెరువుల ఆక్రమణ. బీఆర్ఎస్ పది సంవత్సరాలు కండ్లు మూసుకొని ఉండబట్టే ఈ దుస్థితి ఏర్పడింది. హైదరాబాద్ నగరాన్ని శుద్ధి చేయడానికి సీఎం రేవంత్ రెడ్డి మూసి రివర్ ప్రక్షాళన చేపట్టిండు. తెలంగాణలో ఉన్న అన్ని పట్టణాలలో రెవిన్యూ భూములు కబ్జాలకు గురైంది. ఏనాడు కేసీఆర్ ,వాళ్ళ నాయకులకు కాపాడే సోయి రాలేదు. సీఎం రేవంత్ రెడ్డి వాటిని వెనుకకు తీసుకునే కార్యక్రమం చేస్తున్నారు. పెద్ద పట్టణాలలో,మున్సీ పాలిటిలో హైడ్రా ను ఉపయోగించి అక్రమ కట్టడాలను తొలగిస్తామని మాట ఇచ్చిండ్రు. కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న మంచి పనులను స్వాగతించండి. ప్రభుత్వంపై బురద జల్లి, బురద రాజకీయం చేయకండి.’ అని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌ రెడ్డి అన్నారు.

Top Headlines @ 5 PM: టాప్‌ న్యూస్‌

Show comments