NTV Telugu Site icon

Yemmiganur: ఎమ్మిగనూరు వైసీపీలో కలకలం.. చెన్నకేశవ రెడ్డికి టికెట్‌ ఇస్తే సరి.. లేదంటే..!

Chennakesava Reddy

Chennakesava Reddy

Yemmiganur: కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు అసెంబ్లీ నియోజకవర్గం టికెట్‌పై అధికార వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలో కలకలం రేగుతోంది.. ఎంపీపీ కార్యాలయంలో ఎంపీపీ కేషన్న, పలువురు సర్పంచులు, కొంతమంది ఎంపీటీసీలు సమావేశం అయ్యారు.. సిట్టింగ్‌ ఎమ్మెల్యే చెన్నకేశవ రెడ్డికే ఈసారి కూడా టికెట్‌ ఇవ్వాలని డిమాండ్‌ చేశారు.. చెన్నకేశవరెడ్డికి టికెట్ ఇస్తే గెలిపిస్తాం.. వేరేవాళ్లకు టికెట్ ఇస్తే గెలిపించే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు ఎమ్మిగనూరు ఎంపీపీ కేషన్న.. అయితే, ఎమ్మిగనూరు టికెట్ ఎమ్మెల్యే చెన్న కేశవరెడ్డి స్థానంలో మరొకరిని పోటీ చేయంచాలన్న యోచనలో వైసీపీ అధిష్టానం ఉన్నట్టుగా తెలుస్తోంది.. ఇప్పటికే తాడేపల్లికి చేరింది ఎమ్మిగనూరు టికెట్ పంచాయతి.. తాడేపల్లిలి నాలుగు రోజులుగా టచ్‌లో ఉన్నారు ఎమ్మెల్యే చెన్న కేశవరెడ్డి, మాజీ ఎంపీ బుట్టా రేణుక, రుద్రగౌడ్..

Read Also: Minister Uttam: మేడిగడ్డ పరిశీలనపై సీఎంకి నివేదిక ఇస్తాం.. ఏం చేస్తాం అనేది ప్రకటన చేస్తాం

అయితే, రెండో జాబితా ప్రకారం.. రాష్ట్ర వ్యాప్తంగా సుమారుగా 30 నియోజకవర్గాల్లో మార్పులు ఉండే అవకాశం ఉందనే ప్రచారం సాగుతోంది.. ఎమ్మిగనూరుపై ఇంకా స్పష్టత రాకపోయినా.. ఎమ్మిగనూరు సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న చెన్నకేశవరెడ్డి.. వయో వృద్ధుడు.. ఆయన వయస్సు 82 ఏళ్లు.. దీంతో.. చెన్నకేశవరెడ్డికి ప్రత్యామ్నాయం ఆలోచిస్తోందట పార్టీ హైకమాండ్.. ఎమ్మిగనూరు నుంచి బుట్ట రేణుక లేదా చెన్నకేశవ రెడ్డి ప్రతిపాదించే అభ్యర్థికి ఛాన్స్ ఇచ్చే అవకాశం ఉందంటున్నారు.. కానీ, గ్రౌండ్‌ లెవల్‌లో కొందరు నేతలు.. మరోసారి చెన్నకేశవరెడ్డికే టికెట్‌ ఇవ్వాలని డిమాండ్‌చేస్తున్నారు. కాగా, పలు సందర్భాల్లో సంచలన వ్యాఖ్యలతో చెన్నకేశవ రెడ్డి వార్తల్లో నిలిచే విషయం విదితమే.

Show comments