NTV Telugu Site icon

IMD: తెలంగాణవాసులకు అలర్ట్‌.. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్‌..

Remal Cyclone

Remal Cyclone

తుఫాన్ ప్రభావంతో తెలంగాణలో ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈ నేపథ్యంలోనే తెలంగాణలోని పలు జిల్లాలకు నేడు ఎల్లో అలెర్ట్ జారీ చేసింది ఐఎండీ.. ఈరోజు సాయంత్రం హైదరాబాద్ తో పాటు పలు జిల్లాల్లో వర్షం కురిసే అవకాశం ఉందని వాతావారణ శాఖ వెల్లడించింది. రెమాల్ తుఫాన్ ప్రభావంతో తెలంగాణలో బలమైన ఈదురుగాలులు వీస్తున్నాయి. మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం.. వాయుగుండంగా మారి తీవ్ర తుఫాన్ గా మారింది.. నిన్న సాగర్ ఐలాండ్ వద్ద తుఫాన్ తీరం దాటింది. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్ గిరి, మెదక్, సంగారెడ్డి, మహబూబ్ నగర్, సూర్యాపేట్, నల్గొండ, కామారెడ్డి, ఆదిలాబాద్, నిర్మల్, భద్రాది కొత్తగూడెం జిల్లాలకు నేడు వర్ష కురిసే అవకాశం ఉంది. 40-50 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులతో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. రేపు.. ఎల్లుండి రాష్ట్రంలో పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉందని తెలిపింది.

ఇదిలా ఉంటే.. నిన్న తెలంగాణలో రెమాల్ తుఫాన్ బీభత్సం సృష్టించింది. హైదరాబాద్‌తో పాటు పలు జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షం బీభత్సం సృష్టించింది. ముఖ్యంగా పలు ప్రాంతాల్లో బలమైన గాలులు వీచాయి. దీంతో పలుచోట్ల ఇళ్ల పైకప్పులు ఎగిరిపోయాయి. భారీ వృక్షాలు నేలకొరిగాయి. విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. మడ్చల్ మల్కాజిగిరి, హైదరాబాద్, నాగర్ కర్నూల్, నిజామాబాద్, ఆదిలాబాద్, కలిపి నల్గొండ, సిద్దిపేట, వికారాబాద్ తదితర జిల్లాల్లో గాలివాన కురిసింది. వేర్వేరు ఘటనల్లో మొత్తం 14 మంది చనిపోయారు. దీంతో మృతుల కుటుంబాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి. వర్షాలు, ఈదురుగాలులకు రాష్ట్రంలో 14 మంది మృతి చెందారు. నాగర్ కర్నూలు జిల్లాలో 8 మంది మృతి చెందగా.. శామీర్ పేటలో చెట్టు విరిగిపడి ఇద్దరు మృతి చెందారు. మియాపూర్ లో గొడ కూలి మూడేళ్ల బాలుడు, సిద్ధిపేట జిల్లా క్షీరసాగరలో ఇద్దరు మృతి చెందారు.