NTV Telugu Site icon

POCSO Case: సీఐడీ విచారణకు హాజరుకానున్న యడ్యూరప్ప..

Yediyurappa

Yediyurappa

తనపై నమోదైన పోక్సో కేసుకు సంబంధించి విచారణ నిమిత్తం జూన్ 17వ తేదీన సిఐడి ముందు హాజరవుతానని బీజేపీ సీనియర్ నాయకుడు బిఎస్ యడ్యూరప్ప జూన్ 15 శనివారం తెలిపారు. తనపై కుట్రలకు పాల్పడుతున్న వారికి ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని మాజీ సీఎం బెంగళూరులో అన్నారు. పోక్సో కేసుకు సంబంధించి యడ్యూరప్పను అరెస్టు చేయకుండా కర్ణాటక హైకోర్టు శుక్రవారం సీఐడీని నిలువరించింది. ఈ కేసును విచారిస్తున్న సీఐడీ ఎదుట జూన్ 17న హాజరుకావాలని బీజేపీ సీనియర్ నేతను కోర్టు ఆదేశించింది.

Jangaon: ప్రియుడి ఇంటి ముందు ప్రియురాలి ధర్నా..పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం

ఈ సందర్బంగా యడియూరప్ప మాట్లాడుతూ.. నేను ముందుగా నిర్ణయించిన కార్యక్రమం కోసం ఢిల్లీ వెళ్లాను. జూన్ 17న విచారణకు హాజరవుతానని లిఖితపూర్వకంగా తెలియజేశాను. సీఐడీ అరెస్టు నిలుపుదల చేస్తూ హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. నేను సోమవారం విచారణకు హాజరవుతున్నాను. అనవసరంగా కొందరు గందరగోళం సృష్టించేందుకు ప్రయత్నించారు. నేను ఎవరినీ నిందించదలచుకోలేదు. వాస్తవం అందరికీ తెలుసని ఆయన అన్నారు. కుట్రలకు పాల్పడే వారికి ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని అన్నారు.

Kate middletons: మళ్లీ వివాదంలో కేట్ మిడిల్టన్ తాజా ఫొటో

ఈ ఏడాది మార్చి 14న బాలల లైంగిక నేరాల నుంచి రక్షణ చట్టం (పోక్సో) కింద నమోదైన కేసులో యడ్యూరప్పపై కోర్టు గురువారం నాన్‌ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. బుధవారం ఆయన విచారణకు హాజరుకాకపోవడంతో సిఐడి ప్రత్యేక దర్యాప్తు బృందం అతనిపై అరెస్ట్ వారెంట్‌ను కోరుతూ ఫస్ట్ ఫాస్ట్ ట్రాక్ కోర్టును ఆశ్రయించింది. ఈ విషయంలో పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.., యడ్యూరప్ప తన కుమార్తెను వేధించాడని ఆరోపించిన 17 ఏళ్ల బాలిక తల్లి ఫిర్యాదు ఆధారంగా పోక్సో చట్టం, ఐపీసీ సెక్షన్ 354 A (లైంగిక వేధింపులు) కింద కేసు నమోదు చేశారు. ఈ ఏడాది ఫిబ్రవరి 2న బెంగళూరు లోని డాలర్స్‌ కాలనీలోని తన నివాసంలో ఈ సంఘటన జరిగినిదని అభియోగం.

ఈ అభియోగాన్ని యడియూరప్ప కొట్టిపారేసారు. ఈ కేసుపై తాను న్యాయపరంగా పోరాడతానని చెప్పారు. ముందస్తు బెయిల్‌ను కోరుతూ, ఎఫ్‌ఐఆర్‌ను రద్దు చేయాలని కోరుతూ ఆయన హైకోర్టులో రెండు వేర్వేరు పిటిషన్లు దాఖలు చేశారు. ఆయనపై అభియోగాలు మోపిన బాధితురాలి తల్లి ఊపిరితిత్తుల క్యాన్సర్‌తో బాధపడుతూ గత నెలలో ఇక్కడ ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో మరణించారు. మార్చి 14న కేసు నమోదు చేసినప్పటికీ దర్యాప్తులో ఎలాంటి పురోగతి లేదని బాధితురాలి సోదరుడు ఈ వారం ప్రారంభంలో కోర్టును ఆశ్రయించారు. దింతో యడ్యూరప్పను అరెస్టు చేసి విచారించేలా పోలీసులకు ఆదేశాలు ఇవ్వాలని పిటిషనర్ కోర్టును కోరారు. మార్చిలో సదాశివనగర్ పోలీసులు కేసు నమోదు చేయడంతో, తదుపరి విచారణ కోసం సీఐడీకి బదిలీ చేస్తూ కర్ణాటక డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ అలోక్ మోహన్ ఉత్తర్వులు జారీ చేశారు. దీనితో ఏప్రిల్‌లో యడ్యూరప్పను కార్యాలయానికి పిలిపించి సిఐడి వాయిస్ శాంపిల్‌ ను సేకరించింది.