NTV Telugu Site icon

YSRCP: ఎన్ని పార్టీలు ఏకమై గుంపుగా వచ్చినా సీఎం జగన్ యుద్ధానికి ‘సిద్ధం’..

Ambati

Ambati

ప్రకాశం జిల్లా మేదరమెట్లలో ‘సిద్ధం’ సభ జనసంద్రమైంది. సభ జన సునామీని తలపిస్తుంది. కాసేపట్లో సిద్ధం సభకు సీఎం జగన్ హాజరుకానున్నారు. మధ్యాహ్నం 3.25 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరారు. ఈ సందర్భంగా పలువురు మంత్రులు, నేతలు ‘సిద్ధం’ సభలో మాట్లాడారు. మాజీ మంత్రి అనిల్ కుమార్ మాట్లాడుతూ, సీఎం జగన్‌కు ప్రజల అండదండలు ఉన్నాయి.. వచ్చే ఎన్నికల్లో మన సత్తా చూపించాలని తెలిపారు. జగన్‌ను ఎదుర్కొనే దమ్ములేక పొత్తులు పెట్టుకున్నారని అనిల్ దుయ్యబట్టారు. ఎంతమంది కలిసి వచ్చినా జగన్‌ మరోసారి సీఎం కావడం ఖాయమన్నారు.

APPSC: గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష హాల్ టికెట్లు విడుదల..

మంత్రి కాకాణి మాట్లాడుతూ.. చంద్రబాబుపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. చంద్రబాబు పచ్చి మోసగాడు.. చంద్రబాబు మోసపూరిత హామీలను ప్రజలు నమ్మరని దుయ్యబట్టారు. గతంలో రైతులు, అక్కా చెల్లెమ్మలను మోసం చేశాడు.. చంద్రబాబు అన్ని వర్గాలను మోసం చేశాడని మండిపడ్డారు. సీఎం జగన్‌ ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చారు.. రానున్న ఎన్నికల్లో 175కు 175 సీట్లు గెలిచి తీరుతామని.. మళ్లీ జగన్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేస్తాడని ఈ సందర్భంగా తెలియజేశారు.

Siddham Sabha: మేదరమెట్లలో వైసీపీ చివరి ‘సిద్ధం’ సభ.. భారీగా తరలివస్తున్న కార్యకర్తలు

సిద్ధం సభకు తరలివచ్చిన జనాలను చూస్తుంటే.. ఏంటీ జన ప్రవాహం అనిపిస్తోందని మంత్రి అంబటి రాంబాబు తెలిపారు. ఈ రాష్ట్రంలో ఏ నియోజకవర్గానికి వెళ్లినా 50 శాతం ప్రజలు సీఎం జగన్‌ కావాలనే అంటున్నారని అన్నారు. సీఎం జగన్‌ మొనగాడు.. చంద్రబాబు మోసగాడు అని మండిపడ్డారు. ఇది ఫ్యాన్ కు సైకిల్ కు తేడా అని తెలిపారు. సింగిల్ గా వస్తే చితకబాదుతాం.. ఇద్దరు వస్తే విసిరి కొడతాం.. ముగ్గురు కలిసి వస్తే విసిరి సముద్రంలో ముంచేస్తామని విమర్శలు గుప్పించారు. 14 ఏళ్లలో చంద్రబాబు చేసిన మేలు ఒక్కటీ లేదని తెలిపారు. చంద్రబాబు రా.. కదిలి రా అంటే ఎవరూ రావడం లేదని పేర్కొన్నారు. ఎంతమంది కలిసి వచ్చినా చంద్రబాబు ఓటమి ఖాయం.. ఎలాంటి వివక్ష లేకుండా సీఎం జగన్‌ పారదర్శక పాలన చేశారని మంత్రి అంబటి రాంబాబు తెలిపారు.