NTV Telugu Site icon

AP News: పాలకొల్లు నియోజకవర్గంలో వైసీపీకి బిగ్ షాక్!

Ycp

Ycp

పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు నియోజకవర్గంలో వైసీపీకి బిగ్ షాక్ తగిలింది. పాలకొల్లు మండలంలోని 8 గ్రామాల సర్పంచులు వైసీపీకి గుడ్ బై చెప్పి.. మంత్రి నిమ్మల రామానాయుడు సమక్షంలో టీడీపీలో చేరారు. గత కొంతకాలంగా వైసీపీ నుంచి టీడీపీలోకి చేరికలు కొనసాగుతూనే ఉన్నాయి. ముఖ్య నాయకులు, కార్యకర్తలు, సర్పంచులు వైసీపీకి గుడ్ బై చెప్పి అధికార టీడీపీలోకి చేరుతున్నారు. ఈ క్రమంలో ఇప్పటికే పలు నియోజకవర్గాల్లో వైసీపీ ఖాళీ అయింది.

రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ గత ప్రభుత్వం వైసీపీపై విమర్శలు గుప్పించారు. ‘గత వైఎస్ జగన్ ప్రభుత్వం పంచాయతీలను నిర్వీర్యం చేసి సర్పంచులను బిక్షాటన చేసుకునేలా చేసింది. గ్రామాభివృద్ధే ధ్యేయంగా పని చేసిన సర్పంచుల పరిస్థితి దీనంగా మారింది. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడం కోసం.. అప్పులు చేసి మరి పనులు చేశారు. అభివృద్ధి పనులకు ప్రభుత్వం నుంచి నిధులు రాక, చేసిన అప్పులు తీర్చలేక కొందరు సర్పంచులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ప్రభుత్వం స్పందించి సర్పంచులకు రావాల్సిన బకాయిలు చెల్లించాలని గత పాలనలో రోడ్డుపై ఆందోళనలు చేసినా ఫలితం లేదు’ అని మంత్రి నిమ్మల మండిపడ్డారు.

‘నేటి కూటమి ప్రభుత్వం పంచాయతీల ఆర్థిక పరిపుష్టిని పెంచి సర్పంచులు తల ఎత్తుకునేలా గౌరవం తీసుకొచ్చింది. వచ్చే సంక్రాంతి నాటికి అన్ని గ్రామాల్లో రూ.4,500 కోట్లతో అభివృద్ధి పనులు పూర్తి చేయడమే మా లక్ష్యం. గత వైసీపీ ప్రభుత్వం పంచాయితీ నిధులను పక్కదారి మళ్లించడంతో అభివృద్ధి పూర్తిగా నిలిచిపోయింది’ అని మంత్రి నిమ్మల రామానాయుడు చెప్పుకొచ్చారు.

Show comments