తాడేపల్లి సీఎం క్యాంపు కార్యాలయంలో అసెంబ్లీ, లోక్ సభ ఇంఛార్జుల్లో మార్పులపై కసరత్తు కొనసాగుతుంది. ఇవాళ ఐదవ జాబితా విడుదల చేసే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతుంది. ఇక, ఉదయం నుంచి సీఎం క్యాంపు కార్యాలయానికి పలువురు ఎమ్మెల్యేలు క్యూ కడుతున్నారు. సీఎంఓకు ఎమ్మెల్యేలు కాసు మహేష్ రెడ్డి, ఆరణి శ్రీనివాసులు, అరకు ఎమ్మెల్యే చెట్టి ఫాల్గుణతో పాటు టీడీపీ రెబల్ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కూడా వచ్చారరు.
Read Also: Tummala: సత్తుపల్లిలో ఫుడ్ ఫార్క్.. ఫిబ్రవరిలో ప్రారంభించేది ఆయనే..
అయితే, సీఎం క్యాంపు కార్యాలయానికి నందిగాం, పెదకూరపాడు, మచిలీపట్నం ఎమ్మెల్యేలు వచ్చారు. సీఎంఓకు టీడీపీ రెబల్ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కూడా వచ్చారు. ఆయనకు ఇవాళ మధ్యాహ్నం అనర్హత పిటిషన్ పై స్పీకర్ ముందు విచారణకు హాజరు కావాల్సి ఉంది. దీంతో పాటు సీఎంఓకు సజ్జల రామకృష్ణారెడ్డి, డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి కూడా ఉన్నారు. అలాగే, విజయవాడ ఎంపీ కేశినేని నాని కూడా వచ్చారు. ఈ సమావేశంలో మచిలీపట్నం ఎంపీ అభ్యర్థిపై వైసీపీ హైకమాండ్ కసరత్తు చేస్తుంది. ఎంపీ అభ్యర్థిగా పరిశీలనలో బాడిగ రామకృష్ణా, పేర్ని నాని, సింహాద్రి రమేష్ ఉన్నారు.
