NTV Telugu Site icon

Kesineni Nani: విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో వైసీపీ ఎంపీ అభ్యర్థి కేశినేని నాని రోడ్ షో..

Kesineni

Kesineni

ఎన్టీఆర్ జిల్లా విజయవాడ పశ్చిమ నియోజకవర్గం 38వ డివిజన్ రథం సెంటర్ నుంచి చిట్టినగర్ వరకు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి షైక్ అసిఫ్ ఆధ్వర్యంలో రోడ్డు షో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా వైసీపీ ఎంపీ అభ్యర్థి కేశినేని నాని పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈరోజు తాను వైసీపీ ముఖ్య నాయకులు అందరం కలిసి రోడ్డు షో నిర్వహించామని.. ప్రజల దగ్గర నుంచి మంచి స్పందన వస్తుందని తెలిపారు. తప్పకుండా.. వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి షైక్ అసిఫ్ మంచి మెజారిటీతో గెలవడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.

Crazy Dress: ఏంటి భయ్యా.. ఈ బట్టలు ఇంత సెక్సీగా ఉన్నాయి.. అసలు వీటిని ఎవరైనా కొంటారా..

కచ్చితంగా విజయవాడ పార్లమెంట్ పరిధిలో ఉన్న ఏడుకి ఏడు అసెంబ్లీ సీట్లు.. ఒక ఎంపీ సీటు గెలిచి తిరుతామన్నారు. ఏదైతే జగన్ మోహన్ రెడ్డి పథకాలు.. ఎలక్షన్ కమిషన్ కి చెప్పి ఆపారో ప్రజలు అందరు చుస్తున్నారని అన్నారు. చంద్రబాబుకు త్వరలో ఆంధ్ర ప్రజలు బుద్ది చెప్పడం ఖాయమని ఆరోపించారు. వైసీపీ 175కి 175 అసెంబ్లీ సీట్లు.. 25 పార్లమెంట్ స్థానాలు గెలిచి తిరుతామని తెలిపారు. మరోవైపు.. కేశినేని నాని కుమార్తె కేశినేని శ్వేత ప్రచారంలో దూసుకుపోతున్నారు. జి.కొండూరు మండలం వెల్లటూరు గ్రామంలో వైసీపీ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నారు.

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ కోసం బరిలోకి మరో హీరో.. ఏకంగా పిఠాపురంలో?

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. సర్నాల తిరుపతిరావు యాదవ్, కేశినేని నానిని బంపర్ మెజారిటీతో గెలిపించాలని కోరారు. రైతు భరోసా కేంద్రాలు, సచివాలయాల నిర్మాణాలతో 5 సంవత్సరాలలో అభివృద్ధితో సీఎం జగన్ ప్రజలను మంచిగా చూసుకున్నారని కేశినేని శ్వేత తెలిపారు. మరొక ఛాన్స్ ఇస్తే మన ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్ బాగుంటుంది, సుపరిపాలన అందుతుందని పేర్కొన్నారు. సామాన్యులకు, బడుగు బలహీన వర్గాలకు రాజ్యాధికారం ఇవ్వాలనే మంచి సంకల్పంతో సర్నాల తిరుపతిరావు యాదవ్ కి అవకాశం ఇవ్వడం జరిగిందన్నారు. అభివృద్ధి అంటే గుర్తు వచ్చేది మన కేశినేని నాని అన్నారు. 8వేల కోట్ల రూపాయల నిధులతో రహదారులు నిర్మించి మౌళిక వసతులు అందించారని తెలిపారు. టాటా ట్రస్ట్ కార్డ్ తో ప్రతి గ్రామానికి హెల్త్ ఇన్స్యూరెన్స్ సేవలందించారన్నారు. మూడు పార్టీలు, మూడు గుర్తులు లేవు.. ఒకే పార్టీ ఒకే నినాదం, జై జగన్ అని అన్నారు.