తనకు ఎవరినీ తొక్కాల్సిన అవసరం లేదని గురజాల ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి అన్నారు. బీసీలకు పెద్దపీట వేసిన కాసు బ్రహ్మానంద రెడ్డి కుటుంబం తమదని, ఏ ఒక్క బీసీకి అన్యాయం జరగనివ్వనని, ఏ కులాన్ని తొక్కాల్సిన అవసరం తనకు లేదన్నారు. గురజాలలో తాను చేసిన అభివృద్ధి, ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అండదండలు వైసీపీని గెలిపిస్తాయని మహేష్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. వైసీపీలో ఆశావాహులు ఉన్నారు తప్ప.. అసమ్మతివాదులు లేరుని ఆయన చెప్పుకొచ్చారు.
ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ… ‘వైసీపీలో ఆశావాహులు ఉన్నారు తప్ప.. అసమ్మతివాదులు లేరు. నాయకుల మధ్య పార్టీలో పొరపచ్చాలు ఉంటే కూర్చొని మాట్లాడుకుంటాం. పదవులకు రాజీనామా చేస్తామని అనడం, చేసుకోవడం వారి వ్యక్తిగతం. గురజాలలో నేను చేసిన అభివృద్ధి, ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అండదండలు వైసీపీని గెలిపిస్తాయి. బీసీలకు పెద్దపీట వేసిన కాసు బ్రహ్మానంద రెడ్డి కుటుంబం మాది. ఏ ఒక్క బీసీకి అన్యాయం జరగనివ్వను, ఏ కులాన్ని తొక్కాల్సిన అవసరం నాకు లేదు’ అని అన్నారు.
Also Read: Jogi Ramesh: పవన్ కల్యాణ్‌కు కనీసం ఏపీలో ఓటు ఉందా?.. మేం కూడా లెటర్ రాయబోతున్నాం!
‘జంగా కృష్ణమూర్తి సీటు కావాలని ఆశపడటంలో తప్పులేదు. గురజాలలో నలుగురైదుగురు ఆశావాహులు పోటీ చేయాలని అనుకుంటారు. పార్టీ అందరికీ సీటు ఇవ్వలేదు కదా?. ఎవరు గెలిచే అవకాశం ఉంటుందో వాళ్లకే పార్టీ సీటు ఇస్తుంది. గురజాలలో పోటీ చేయాలా?, నరసరావుపేటలో పోటీ చేయాలా? అన్నది అధిష్టానం చూసుకుంటుంది. కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో నన్ను గురజాల పంపించారు. అందరి సహకారంతో విజయం సాధించాను. ఈసారి కూడా అలాగే విజయం సాధిస్తా’ అని కాసు మహేష్ రెడ్డి చెప్పారు.