Site icon NTV Telugu

Narasaraopet MLA: ఎంపీ రాజీనామాతో పార్టీకి నష్టం లేదు: ఎమ్మెల్యే గోపిరెడ్డి

Mla Gopireddy

Mla Gopireddy

Narasaraopet MLA: వైసీపీకి నరసరావుపేట ఎంపీ లావు కృష్ణదేవరాయలు రాజీనామాపై స్థానిక ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి స్పందించారు. ప్రాంతీయ పార్టీలలో అధిష్టాన నిర్ణయానికి కట్టుబడి ఉండాలని ఆయన పేర్కొన్నారు. నరసరావు పేట పార్లమెంట్ పరిధిలో అందరం ఓసీ అభ్యర్థులమేనని.. అందుకే నరసరావు పేట పార్లమెంట్‌లో బీసీ అభ్యర్దిని రంగంలోకి దించాలని అధిష్టానం భావించిందని ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. ఎంపీ రాజీనామాతో పార్టీకి నష్టం లేదని ఆయన వ్యాఖ్యానించారు. వైసీపీ క్యాడర్ బలంగా పని చేస్తే పల్నాడు జిల్లాలో విజయం సాధిస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

Read Also: Breaking: వైసీపీకి, ఎంపీ పదవికి కృష్ణదేవరాయలు రాజీనామా

వైసీపీకి నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. పార్టీ ప్రాథమిక సభ్యత్వంతో పాటు ఎంపీ పదవికి ఆయన రాజీనామా చేశారు. కొంతకాలంగా పార్టీలో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన చెప్పారు. వైసీపీలో కొంత అనిశ్చితి ఏర్పడిందని.. దానికి తాను బాధ్యుడిని కాదని ఎంపీ చెప్పారు. గత కొద్దిరోజులుగా జరుగుతున్న పరిణామాలతో కేడర్‌ అయోమయానికి గురువుతున్నారని.. దానికి తెరదించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. నరసరావుపేట నుంచి బీసీ అభ్యర్థిని పోటీ చేయించే యోచనలో వైసీపీ ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సారి గుంటూరు నుంచి పోటీకి దిగాలని శ్రీకృష్ణదేవరాయలకు అధిష్ఠానం సూచించింది. నరసరావుపేట నుంచే పోటీ చేస్తానని లావు శ్రీకృష్ణదేవరాయలు తేల్చిచెప్పారు. హైకమాండ్ నరసరావుపేట ఎంపీ టికెట్‌ తేల్చికముందే లావు శ్రీకృష్ణదేవరాయలు రాజీనామా చేశారు.

Exit mobile version