Site icon NTV Telugu

సీఎం కేసీఆర్‌కు వైసీపీ నేతల కౌంటర్‌ !

ఏపీలో పార్టీ విస్తరిస్తామన్న సీఎం కేసీఆర్‌కు కౌంటర్ ఇస్తున్నారు వైసీపీ నేతలు. నాడు-నేడుతో స్కూళ్ల రూపు రేఖలు మార్చామని, టీఆరెస్‌ పాలనలో ఒక్కటైనా మార్చారా అంటూ ఫైరవుతున్నారు. మొన్న సీఎం కేసీఆర్ చేసిన ఈ వ్యాఖ్యలు… ఇప్పుడు హాట్ టాపిగ్గా మారాయ్‌. ఏపీలోనూ పార్టీ పెట్టాలంటూ ఆహ్వానాలు వచ్చాయన్న ముఖ్యమంత్రి కామెంట్లపై స్పందిస్తున్నారు ఏపీ మంత్రులు.

తెలంగాణ కంటే ఏపీలోనే పాలన బాగుందని కితాబిచ్చుకుంటున్నారు. తెలంగాణలోని ప్రభుత్వ స్కూళ్ల టాయిలెట్స్‌ ఎలా ఉన్నాయో.. ఏపీలోని ప్రభుత్వ స్కూళ్ల టాయిలెట్స్‌ ఎలా ఉన్నాయో పోల్చి చూస్తే.. తెలుస్తుందన్నారు మంత్రి సీదిరి అప్పలరాజు. మంత్రి అనిల్ కూడా స్పందించారు. కేసీఆర్‌ రాజకీయ పార్టీ పెట్టుకుంటే తమకు అభ్యంతరం లేదన్నారు. తెలంగాణలో కంటే ఏపీలోనే ఎక్కువ సంక్షేమ పథకాలు అమలవుతున్నాయని చెప్పారు. మొత్తం మీద… టీఆర్‌ఎస్‌ ప్లీనరీలో తెలంగాణ సీఎం చేసిన కామెంట్లు… పొలిటికల్ ఫైట్‌కు దారి తీశాయ్‌. రెండు అధికార పార్టీల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి.

Exit mobile version