NTV Telugu Site icon

Yarlagadda Venkat Rao: యార్లగడ్డ సమక్షంలో టీడీపీలో చేరిన వైసీపీ నేత వీరాంజనేయులు

Yarlagadda Venkat Rao

Yarlagadda Venkat Rao

Yarlagadda Venkat Rao: కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గం బపులపాడు మండలం కానుమొలు గ్రామంలో బీరయ్య స్వామి , కామరవతి అమ్మవార్ల గుడి ప్రతిష్ట కార్యక్రమంలో టీడీపీ అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం హనుమాన్ జంక్షన్ పార్టీ కార్యాలయంలో రామన్న గూడెం సర్పంచ్ రెడ్డి వీరాంజనేయులు వైసీపీ పార్టీని వీడి యార్లగడ్డ వెంకట్రావు సమక్షంలో టీడీపీలో చేరారు. యార్లగడ్డ వెంకట్రావు ఆయనకు టీడీపీ కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ కార్యకర్తలు, జనసేన, బీజేపీ పార్టీలకు చెందిన కార్యకర్తలు, యార్లగడ్డ అభిమానులు పాల్గొన్నారు. అంతకు ముందు ఈ కార్యక్రమానికి విచ్చేసిన యార్లగడ్డ వెంకట్రావుకు టీడీపీ నేతలు, కార్యకర్తలు ఘనంగా స్వాగతం పలికారు.