టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా లోకేష్ ఖాళీగా ఉండి ట్వీట్లు పెడుతున్నారని ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ విమర్శించారు. 70 రోజుల్లో ఎవరు మ్యాకప్పో.. ఎవరు ప్యాకప్పో తెలుస్తుందని ఎద్దేవా చేశారు. పాదయాత్ర చేసి శ్రీకాకుళం రాకుండానే లోకేష్ ప్యాకప్ అయిపోయాడని బొత్స అన్నారు. ప్రజలు ఏదీ మరిచిపోరని, మరో డెబ్బై రోజుల్లో వారే సరైన సమాదానం చెబుతారని మంత్రి బొత్స పేర్కొన్నారు. పార్టీ కీలక సభ్యులతో సమావేశం ఏర్పాటు చేస్తున్నామని, ఉత్తరాంధ్ర ప్రాంతానికి తగరపువలసలో సీఎం జగన్ బహిరంగ సభ నిర్వహించనున్నాం అని చెప్పారు.
శ్రీకాకుళం జిల్లాలో మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ… ‘పార్టీ కీలక సభ్యులతో సమావేశం ఏర్పాటు చేస్తున్నాం. ఉత్తరాంధ్ర ప్రాంతానికి తగరపువలసలో సీఎం జగన్ బహిరంగ సభ నిర్వహించనున్నాం. 2019లో ఉత్తరాంధ్ర నుండే అత్యధిక స్థానాలు వచ్చాయి. అందుకే ఇక్కడి నుండే సభ పెట్టాం. ప్రత్యేక హోదా తాకట్టు పెట్టింది నారా చంద్రబాబే. కేంద్రంకు కేవలం అంశాల వారీగానే మద్దతు ఇస్తున్నాం. అభివృద్ధి కోసం రేవంత్ రెడ్డే ప్రదాని మోడీని కలిశారు. ఫెడరల్ వ్యవస్థలో కేంద్రం, రాష్ట్రాలుకో ఆర్డినేషన్తో వెళ్లాలి’ అని అన్నారు.
Also Read: YS Sharmila: సీఎం అయిన తర్వాత జగన్ మారిపోయాడు: వైఎస్ షర్మిల
‘మేము మూడు రాజదానులకి మద్దతు ఇస్తే.. బీజేపీ అమరావతికి జై కోడుతోంది. ప్రతిపక్షాల వారికి అధికారం కావాలి.. మాకు మాత్రం సంక్షేమం కావాలి. ప్రజలు ఏదీ మరిచిపోరు.. మరో డెబ్బై రోజుల్లో సమాదానం చెబుతారు. చంద్రబాబు, జగన్.. ఎవరి పాలనలో ప్రజల జీవన ప్రమాణాలు పెరిగాయో ఓసారి బేరీజువేసుకోండి. గంటా స్వయంగా రాజీనామా ఇచ్చారు. స్పీకర్ ఫార్మాట్లో లెటర్ రాసి స్పీకర్ గారిని కలిసే రాజీనామా విషయం చెప్పారు. ఆయన స్వలాభం కోసం రాజీనామా చేసారా?. దానిని మాపై ఆపాదిస్తే ఎలా?. నారా లోకేష్ ఖాళీగా ఉండి ట్వీట్లు పెడుతున్నారు. 70 రోజుల్లో ఎవరు మ్యాకప్పో.. ఎవరు ప్యాకప్పో తెలుస్తుంది’ అని మంత్రి బొత్స ఎద్దేవా చేశారు.
