NTV Telugu Site icon

Yashaswi Jaiswal: పెర్త్ టెస్టులో సెంచరీ సాధించిన జైస్వాల్.. ఏకంగా ఎనిమిది రికార్డులు..

Yashaswi Jaiswal

Yashaswi Jaiswal

భారత జట్టు స్టార్ ఓపెనర్ యశస్వి జైస్వాల్ పెర్త్ టెస్టులో సెంచరీ సాధించాడు. ఆస్ట్రేలియా గడ్డపై ఇది అతనికి మొదటి సెంచరీ. ఈ సెంచరీతో కొన్ని రికార్డులు కూడా తన ఖాతాలో వేసుకున్నాడు. భారత జట్టు రెండో ఇన్నింగ్స్‌లో యశస్వి జైస్వాల్ సిక్సర్‌తో ఈ సెంచరీ పూర్తి చేశాడు. టెస్టు క్రికెట్‌లో యశస్వికి ఇది నాలుగో సెంచరీ.

పెర్త్ టెస్ట్ మూడో రోజు (నవంబర్ 24), యశస్వి జైస్వాల్ సెంచరీ చేసిన వెంటనే తనదైన శైలిలో సంబరాలు చేసుకున్నాడు. 205 బంతుల్లో 8 ఫోర్లు, 3 సిక్సర్ల బాదిన యువ ఆటగాడు.. ఈ సెంచరీ సాధించాడు. ఆస్ట్రేలియా గడ్డపై తన తొలి టెస్టులో యశస్వి జైస్వాల్ రెండో ఇన్నింగ్స్‌లో కంపోజ్ చేసిన సెంచరీతో తన సత్తాను నిరూపించుకున్నాడు. జోష్ హేజిల్‌వుడ్ వేసిన బంతికి పైర్ కట్ కొట్టడం ద్వారా అతను అద్భుతమైన శైలిలో ఈ ఫీట్ సాధించాడు. 22 ఏళ్ల జైస్వాల్ సెంచరీ చేసిన వెంటనే కేఎల్ రాహుల్ (77) ఔటయ్యాడు. అయితే వీరిద్దరూ ప్రత్యేక భాగస్వామ్యంతో రికార్డు సృష్టించారు. యశస్వి ఈ సెంచరీతో 8 రికార్డులు క్రియేట్ అయ్యాయి. వాటి గురించి తెలుసుకుందాం…

యశస్వి సాధించిన రికార్డులు..

  1. మొదటి 15 టెస్టుల్లో 1500+ పరుగులు చేసిన తొలి ఆసియా బ్యాటర్‌గా రికార్డు
  2. ఇన్నింగ్స్‌పరంగా అత్యంత వేగంగా 1500+ రన్స్‌ చేసిన రెండో భారత బ్యాటర్‌గా యశస్వి. 28 ఇన్నింగ్స్‌ల్లో దీన్ని సాధించాడు. గతంలో పుజారా కూడా 28 ఇన్నింగ్స్‌ల్లోనే ఈ ఘనత సాధించాడు.
  3. ఆస్ట్రేలియాలో ఆడిన మొదటి టెస్టులోనే సెంచరీ చేసిన మూడో భారత బ్యాటర్‌గా యశస్వి రికార్డు.
  4. ఆస్ట్రేలియాపై సెంచరీ చేసిన రెండో యంగెస్ట్‌ ఓపెనర్‌గా యశస్వి రికార్డు సృష్టించాడు. అతడు 22 ఏళ్ల 330 రోజుల వయసులో ఈ ఘనత సాధించాడు. అతడి కంటే ముందు కేఎల్ రాహుల్ (22 ఏళ్ల 263 రోజులు)
  5. యశస్వి కంటే ముందు జైసింహా (1967-68), సునీల్ గావస్కర్ (1977-78) సాధించారు. ఈ ముగ్గురూ రెండో ఇన్నింగ్స్‌లోనే చేయడం గమనార్హం.
  6. 23 ఏళ్లు రాకముందే ఒకే క్యాలెండర్‌ ఇయర్‌లో అత్యధిక టెస్టు సెంచరీలు చేసిన జాబితాలో యశస్వి ఐదో బ్యాటర్. ఈ ఏడాది యశస్వి 3 శతకాలు బాదాడు. అందరికంటే సునీల్ గావస్కర్ (1971లో 4 సెంచరీలు) సాధించాడు.
  7. భారత్ తరఫున 23 ఏళ్ల వయసులోపే టెస్టుల్లో అత్యధిక సెంచరీలు సాధించిన ఐదో బ్యాటర్ యశస్వి (4). సచిన్ అందరికంటే ఎక్కువగా 8 సెంచరీలు చేశాడు.
  8. ఆస్ట్రేలియాలో ఆ జట్టుపై చివరిసారిగా సెంచరీ సాధించిన బ్యాటర్ కేఎల్ రాహుల్. 2014-15 సీజన్‌లో ఈ ఘనత సాధించాడు. ఇప్పుడు యశస్వి సెంచరీ నమోదు చేశాడు.