NTV Telugu Site icon

Yashasvi Jaiswal Century: ఇంకో 57 పరుగులే.. చరిత్ర సృష్టించనున్న యశస్వి జైస్వాల్! సచిన్, కోహ్లీకి కూడా సాధ్యం కాలేదు

Yashasvi Jaiswal Rohit

Yashasvi Jaiswal Rohit

Yashasvi Jaiswal Needs 57 Runs to Creates History in Indian Cricket: విండ్సర్ పార్క్ వేదికగా వెస్టిండీస్‌తో జరుగుతున్న తొలి టెస్టులో భారత యంగ్ ప్లేయర్ యశస్వి జైస్వాల్‌ అద్భుత ఆటతో ఆకట్టుకుంటున్నాడు. ఓపెనర్‌గా రోహిత్ శర్మతో కలిసి బరిలోకి దిగిన యశస్వి.. ఇప్పటికే సెంచరీ చేసి చేశాడు. 350 బంతుల్లో 14 ఫోర్లుతో 143 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. సీనియర్ ప్లేయర్ రోహిత్ అండగా నిలుస్తూ భారత స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. మంచి షాట్లతో అలరిస్తున్న యశస్విపై ప్రశంసల వర్షం కురుస్తోంది.

యశస్వి జైస్వాల్‌ శతకం చేయడంతో టీమిండియా తరఫున టెస్టు అరంగేట్రంలో సెంచరీ చేసిన 17వ బ్యాటర్‌గా నిలిచాడు. అతిపిన్న వయసులో టెస్టుల్లో టీమిండియా తరఫున సెంచరీ చేసిన మూడో ఓపెనర్‌గా, నాలుగో ఆటగాడిగా రికార్డులను నమోదు చేశాడు. అయితే 143 పరుగులతో అజేయంగా నిలిచిన యశస్విని ఓ అరుదైన రికార్డు ఊరిస్తోంది. అదే.. టెస్టు డెబ్యూలో డబుల్ సెంచరీ చేసిన మొదటి భారత ఆటగాడిగా నిలిచే అవకాశం. ఇప్పటివరకు టెస్టు అరంగేట్రంలో డబుల్ సెంచరీ చేసిన భారత ప్లేయర్ లేడు. ఈ రికార్డు సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీకి కూడా సాధ్యం కాలేదు. భారత్ తరఫున డెబ్యూలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా శిఖర్ ధావన్ (187) ఉన్నాడు.

Also Read: WI vs IND Day 2 Highlights: రోహిత్‌, జైస్వాల్ సెంచరీలు.. భారీ ఆధిక్యం దిశగా భారత్!

వెస్టిండీస్‌తో జరుగుతున్న తొలి టెస్టు మూడో రోజు ఆటలో యశస్వి జైస్వాల్‌ మరో 57 పరుగులు చేస్తే.. భారత్ తరఫున అరంగేట్రంలో డబుల్ సెంచరీ చేసిన తొలి ప్లేయర్‌గా చరిత్ర సృష్టిస్తాడు. మొత్తంగా ఎనిమిదవ ప్లేయర్‌గా నిలుస్తాడు. ఈ జాబితాలో ఇంగ్లండ్ ఆటగాడు ఆర్ఈ ఫోస్టర్ మొదటి స్థానంలో ఉన్నాడు. 1903లో ఆస్ట్రేలియాపై ఫోస్టర్ 287 రన్స్ బాదాడు. ఎల్జీ రోవ్ (214), డీఎస్బీపీ కురుప్పు (201), ఎంఎస్ సింక్లైర్ (214), జేఏ రుడాల్ఫ్ (222), కేఆర్ మేయర్స్ (210), డీపీ కాన్వే (200) ఈ జాబితాలో ఉన్నారు.

యశస్వి జైస్వాల్‌ ఇటీవల ముగిసిన ఐపీఎల్‌ 2023 సీజన్‌లో రాణించడంతో పాటు గత కొంతకాలంగా దేశవాళీ క్రికెట్‌లో నిలకడైన ప్రదర్శన చేస్తున్నాడు. అద్భుతంగా ఆడుతున్న అతడు టీమిండియా సెలక్టర్ల దృష్టిలో పడ్డాడు. దాంతో ఇంగ్లండ్‌ వేదికగా జరిగిన ఐసీసీ టెస్ట్‌ ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌ 2023 ఆడే భారత జట్టులో చోటు సంపాదించాడు. అయితే తుది జట్టులో చోటు దక్కలేదు. విండీస్‌ టూర్‌కు ఎంపిక కావడమే కాకుండా.. ఓపెనర్‌గా బరిలోకి దిగి సత్తాచాటాడు.

Also Read: Gold Price Today: మహిళలకు షాక్.. భారీగా పెరిగిన బంగారం ధరలు!

 

Show comments