NTV Telugu Site icon

KKR vs RR : జైస్వాల్ విధ్వంసం.. 13 బంతుల్లో హాఫ్‌ సెంచరీ

Jaiswal

Jaiswal

యువ ఆట‌గాడు య‌శ‌స్వి జైస్వాల్ త‌న సూప‌ర్ ఫామ్‌ను కంటిన్యూ చేస్తున్నాడు. ఐపీఎల్‌లో రాజస్తాన్ ఓపెనర్ యశస్వి జైస్వాల్ చరిత్ర సృష్టించారు. ఐపీఎల్లో తక్కువ బంతుల్లో హాఫ్ సెంచరీ చేసిన బ్యాటర్ గా నిలిచాడు. జైస్వాల్ కేవలం 13 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేశాడు. 2018లో కేఎల్ రాహుల్ 14 బంతుల్లో 51 రన్స్ చేయగా.. 2022లో ప్యాట్ కమిన్స్ 14 బంతుల్లో 56 రన్స్ చేశారు. శార్దూల్ ఠాకూర్ బౌలింగ్‌లో(2.5వ ఓవ‌ర్‌) సింగిల్ తీసి 13 బంతుల్లోనే 7 ఫోర్లు, 3 సిక్స‌ర్ల‌తో అర్ధ‌శ‌త‌కాన్ని పూర్తి చేసుకున్నాడు. ఈ క్ర‌మంలో ఐపీఎల్‌లో చ‌రిత్ర‌లో అత్య‌ధిక వేగ‌వంత‌మైన హాప్ సెంచ‌రీ చేసిన ఆట‌గాడిగా నిలిచాడు. ఈ ఓవ‌ర్‌లో జైస్వాల్ హ్యాట్రిక్ ఫోర్లు కొట్టాడంతో 14 ప‌రుగులు వ‌చ్చాయి. అయితే.. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా కోల్‌కతా నైట్ రైడర్స్‌తో రాజస్తాన్ రాయల్స్ తలపడుతోంది.

Also Read : Ketika Sharma: ఆ ఎత్తులు.. పల్లాలు చూసి కుర్రాళ్ళు ఆగగలరా..?

అయితే.. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది రాజస్తాన్‌. దీంతో.. మొదట బ్యాటింగ్‌కు దిగిన కోల్‌కతా ఆటగాళ్లు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 149 పరుగులు చేశారు. లక్ష్య ఛేదనకు దిగిన రాజ‌స్థాన్‌కు ఆదిలోనే భారీ షాక్ త‌గిలింది. బ‌ట్లర్(0) ర‌నౌట్ అయ్యాడు. హర్షిత్ రాణా బౌలింగ్‌లో బ‌ట్ల‌ర్ ఆడ‌గా బంతి బ్యాట్‌కు త‌గ‌ల‌లేదు. ప్యాడ్‌కు తాక‌డంతో ప‌క్క‌కు వెళ్లింది. బ‌ట్ల‌ర్ సింగిల్ వ‌ద్ద‌ని చెప్ప‌లోపే జైస్వాల్ స్ట్రైకింగ్ ఎండ్‌కు దాదాపు వ‌చ్చేయ‌డంతో బ‌ట్ల‌ర్ అత‌డి కోసం త‌న వికెట్‌ను త్యాగం చేశాడు. దీంతో రాజ‌స్థాన్ 30 ప‌రుగుల(1.4వ ఓవ‌ర్‌) వ‌ద్ద తొలి వికెట్ కోల్పోయింది. అయితే.. జైస్వాల్‌ తక్కువ బంతుల్లో బంతులు బాది.. బ్యాట్‌తో స్వైర విహారం చేస్తున్నాడు.

Also Read : NTR: తారక్ హ్యాండ్ పడితే.. ‘అన్ని మంచి శకునములే’