NTV Telugu Site icon

Yarlagadda VenkatRao: యార్లగడ్డ ఉదారస్వభావం.. సొంత ఖర్చుతో కుట్టు మిషన్ల పంపిణీ..

12

12

Yarlagadda VenkatRao: గన్నవరం నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు రూరల్ టైలర్స్ అసోసియేషన్ వారికి 20 కుట్టు మిషన్లు పంపిణీ చేశారు. యార్లగడ్డ సొంత ఖర్చుతో రూ.2 లక్షల విలువైన 20 కుట్టు మిషన్లను నిరుపేదలకు అందజేసి తన ఉదారస్వభావాన్ని చాటుకున్నారు. ప్రజలకు టీడీపీ ఎల్లప్పుడు అండగా ఉంటుందని తెలిపారు. ప్రపంచ టైలర్స్‌ దినోత్సవాన్ని పురస్కరించుకొని విజయవాడ రూరల్ మండలం ప్రసాదంపాడులోని వివేకానంద స్కూల్ గ్రౌండ్ లో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో బొప్పన హరికృష్ణ ఆధ్వర్యంలో కుట్టు మిషన్ ల పంపిణీ కార్యక్రమం చేపట్టారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుత ఫ్యాషన్ ప్రపంచంలో రెడీమెడ్‌ రంగం విస్తరించడంతో దర్జీలకు డిమాండ్ తగ్గిందన్నారు. దీంతో టైలర్స్ పరిస్థితి దయనీయంగా మారిందని అవేదన వ్యక్తం చేశారు. ప్రజలు టైలరింగ్‌ వృత్తిని ప్రోత్సహించి అర్ధాకలితో అలమటిస్తున్న దర్జీలకు అండగా నిలువాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వం సైతం టైలర్లకు మద్దతుగా నిలువాలని కోరారు. రాబోయే టీడీపీ-జనసేన సంకీర్ణ ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలకు అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో దాసరి శ్రీను, వి.శ్రీనివాసరావు, ఎనికెపాడు రాజు, ఎనికెపాడు శ్రీనివాసరావు, రూరల్ టైలర్స్ అసోసియేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

తాజాగా.. విజయవాడ రూరల్ మండల తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో చేపట్టిన అష్ఠద్రవ్య మహాగణపతి, రాజ్యలక్ష్మి, సుదర్శన లక్ష్మీనారసింహ యాగం పూర్తైంది. గన్నవరం నియజకవర్గ ప్రజలు ఆయురారోగ్యాలతో జీవించాలని, వచ్చే ఎన్నికల్లో టీడీపీ-జనసేన కూటమి భారీ విజయం సాధించి చంద్రబాబు సీఎం కావాలని కోరుకుంటూ.. గన్నవరం ఎమ్మెల్యే అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు చేపట్టిన ఈ యాగం సోమవారం ప్రారంభమై మూడు రోజుల పాటు సాగింది. యార్లగడ్డ వెంకట్రావు, శ్రీమతి జ్ఞానేశ్వరి యాగంలో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. భగవంతుడి అనుగ్రహంతో ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు.