Yarlagadda Venkat Rao: గన్నవరం నియోజకవర్గ టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావుకు వెలమ కుటుంబ సభ్యులు మద్దతు తెలిపారు. ఉంగుటూరు మండలం తేలప్రోలు గ్రామంలో ఆదివారం ఏర్పాటు చేసిన నియోజకవర్గ స్థాయి వెలమ కుటుంబ సభ్యుల ఆత్మీయ సమావేశంలో యార్లగడ్డ వెంకట్రావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసం చంద్రబాబు ముఖ్యమంత్రి కావటం చారిత్రక అవసరం అన్నారు. చంద్రబాబుకు గన్నవరం నియోజకవర్గం వేదికగా అవమానం జరిగిందని, ఇక్కడ టీడీపీ జెండా ఎగరేసి బాబుకు గిఫ్ట్ ఇద్దామని పిలుపునిచ్చారు. తనను ఒక్క అవకాశం ఇచ్చి ఎమ్మెల్యేగా గెలిపించాలని కోరారు. వెలమ కుటుంబ సభ్యుల సంక్షేమం, అభివృద్ధికి ప్రత్యేకంగా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. నిరంతరం అందుబాటులో ఉండి ప్రజలకు సేవ చేస్తానని తెలిపారు. సైకిల్ గుర్తుపై ఓటేసి తనను ఎమ్మెల్యేగా, గాజు గ్లాసు గుర్తుకు ఓటేసి బాలశౌరిని ఎంపీగా అత్యధిక మెజారిటీతో గెలిపించాలని వెలమ కుటుంబ సభ్యులను అభ్యర్థించారు.
ఈ కార్యక్రమంలో సభాధ్యక్షులు ఎ. సీతారామపురం గ్రామ సర్పంచి బొరపురెడ్డి గణేష్, బొరపురెడ్డి శ్రీనివాసరావు, తేలప్రోలు గ్రామ పార్టీ అధ్యక్షులు బీమవరపు వెంకటరెడ్డి, వేగిరెడ్డి పాపారావు, డా. గోర్జి సత్యనారాయణ, డా. సిరిపురపు కిరణ్ కుమార్, జనసేన నియోజకవర్గ సమన్వయకర్త చలమలశెట్టి రమేష్, కోటగిరి వరప్రసాద్, దయాల రాజేశ్వరరావు, పుట్టా సురేష్, కోటగిరి ప్రసాద్, బత్తుల పుల్లారెడ్డి, స్టాలిన్, ఆర్నేపల్లి సూరిబాబు, సూరెడ్డి బెనర్జీ, చింతల అప్పారావు, పసుపులేటి శంకరరావు, గుడ్డేటి శ్యామ్, సందీప్, శివాజీ, మూల్పూరి సాయి కల్యాణి, చిటికెల జయమ్మ, డోకల శారద, దొడ్ల కుమారి, తదితరులు పాల్గొన్నారు..