Yanamala Ramakrishnudu: రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు హ్యాపీగా లేరంటూ సంచలన వ్యాఖ్యలుచేశారు తెలుగుదేశం పొలిట్‌బ్యూరో సభ్యులు యనమల రామకృష్ణుడు.. జైలులో ఉన్న చంద్రబాబుతో ములాఖత్ అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన.. చంద్రబాబు జైల్లో హ్యాపీగా లేరని అన్నారు. చంద్రబాబు గదిలో ఏసీ లేక ఇబ్బంది పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.. ఏసీ ఏర్పాటు చేయాల్సిందిగా జైలు అధికారులను అడిగాం.. నిబంధనల ప్రకారం ఏసీ సౌకర్యం కుదరదని అధికారులు అంటున్నారని వివరించారు. ఇక, రిమాండ్‌కు వెళ్లిన ముందు మూడు రోజులు దోమలతో ఇబ్బంది పడ్డారు, తర్వాత దోమతెరలు ఇచ్చారని తెలియజేశారు.. అయితే, తన సౌకర్యాలు కంటే కార్యకర్తలు, ప్రజల గురించి ఎక్కువగా చంద్రబాబు ఆలోచిస్తున్నారని అని చెప్పుకొచ్చారు మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు.
Read Also: Niharika Konidela: ఆ ఒక్క పోస్టుతో అలాంటి వాళ్ళ నోళ్ళు మూయించిన నిహారిక
కాగా, వినాయక చవితి సందర్భంగా రాజమండ్రి నాళం భీమరాజు వీధిలోని శ్రీ సిద్ధి లక్ష్మీ గణపతి స్వామిని టీడీపీ అధినేత చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి, బాలకృష్ణ సతీమణి వసుంధర దర్శించుకున్నారు. ఆలయ పూజారులు పూర్ణకుంభంతో చంద్రబాబు కుటుంబ సభ్యులకు స్వాగతం పలికారు. అనంతరం భువనేశ్వరి, వసుంధర పూజలు నిర్వహించారు. చంద్రబాబుకు ఉన్న విఘ్నాలు అన్ని తొలగిపోవాలని వేడుకొన్నారు. అనంతరం చంద్రబాబుతో ములాఖత్ కోసం భువనేశ్వరి, బ్రాహ్మణి , యనమల రామకృష్ణ.. రాజమండ్రి సెంట్రల్ జైలులోకి వెళ్లారు. సుమారు 40 నిమిషాల పాటు చంద్రబాబుతో మాట్లాడారు.. ఢిల్లీలో లోకేష్ పర్యటన, ఏపీలో తాజా రాజకీయ పరిణామాలను చంద్రబాబుకు వివరించారు. ఈ సందర్భంగా ఉదయం విఘ్నేశ్వరుడిని పూజించి తీసుకుని వచ్చిన ప్రసాదాన్ని చంద్రబాబుకు అందజేశారు. అనంతరం సెంట్రల్ జైలు నుండి బయటకు వచ్చి మీడియాతో మాట్లాడిన యనమల రామకృష్ణ.. ఏ తప్పు చేయకుండా జైలుకు వెళ్లిన మహానాయకుడు చంద్రబాబు అన్నారు.. చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేసింది తప్పు చేసిన వ్యక్తి.. ఆందోళనలు నేపథ్యంలో ఆందోళనలు చేసినందుకు అరెస్టు చేసిన కార్యకర్తలు ఎలా ఉన్నారు అని చంద్రబాబు అడిగారని వివరించారు.. ఇక, చంద్రబాబుకు భద్రత పెంచినట్టు పేర్కొన్నారు. 21వ తేదీ నుండి ప్రారంభం కానున్న అసెంబ్లీ సమావేశాలలో ఏ విధంగా వ్యహరించాల్సిన విషయాలను పార్టీ అధినేతతో చర్చించా.. పార్లమెంట్ లో టీడీపీ ఎంపీలు నిరసనలు చేయడం వలన జాతీయ నాయకుడై చంద్రబాబు అరెస్టు విషయం దేశ వ్యాప్తంగా తెలుస్తోంది. చంద్రబాబు తనకంటే కార్యకర్తల సంక్షేమం కోసమే ఆలోచిస్తున్నారని వెల్లడించారు యనల రామకృష్ణుడు.