Site icon NTV Telugu

Yamaha Aerox 155: స్టైలిష్ కలర్ ఆప్షన్లు, OBD-2B ఎమిషన్ నిబంధనలతో యమహా ఎయిరాక్స్ 155 భారత్‌లో లాంచ్..!

2025 Aerox 155

2025 Aerox 155

Yamaha Aerox 155: ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ యమహా తన పాపులర్ మాక్సీ స్కూటర్ యమహా ఎయిరాక్స్ 155 మోడల్‌ను 2025 వెర్షన్‌లో భారత్‌లో విడుదల చేసింది. కొత్త ఎమిషన్ నిబంధనలకు అనుగుణతతో పాటు స్టైలిష్ కలర్ ఆప్షన్లు, యథాతథంగా కొనసాగుతున్న శక్తివంతమైన పనితీరు ఈ మోడల్‌ను మాక్సీ స్కూటర్ లవర్స్‌కు పర్ఫెక్ట్ చాయిస్‌గా నిలబెట్టేలా ఉన్నాయి. మరి ఈ స్కూటీ సంబంధించి పూర్తి వివరాలను ఒకసారి చూద్దామా..

Read Also: India Pakistan War: ఇండియా-పాకిస్థాన్ యుద్ధం వస్తే.. ఏయే రాష్ట్రాలు ప్రభావితమవుతాయి?

ఈ యమహా ఎయిరాక్స్ 155లో 155సీసీ లిక్విడ్ కూల్డ్, సింగిల్ సిలిండర్ ఇంజిన్ ఉంది. ఇది వేరియబుల్ వాల్వ్ యాక్చ్యుయేషన్ (VVA) టెక్నాలజీతో వచ్చింది. ఈ ఇంజిన్ 14.75bhp, 13.9Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇది CVT గేర్‌బాక్స్ ద్వారా పని చేస్తుంది. ఇక ఈసారి ఎయిరాక్స్ 155లో జరిగిన ప్రధాన మార్పు అంటే.. OBD-2B ఎమిషన్ నిబంధనలకు అనుగుణంగా ఇంజిన్‌ను అప్డేట్ చేయడమే. నిజానికి మెకానికల్‌ పరంగా ఇంజిన్‌లో ఎలాంటి మార్పులు చేయలేదు. ఇక స్టైలింగ్ పరంగా చూస్తే.. S వేరియంట్‌కు ‘ఐస్ ఫ్లో వెర్మిలియన్’ అనే కొత్త కలర్ స్కీమ్ అందుబాటులోకి వచ్చింది. ఇది మునుపటి గ్రే వెర్మిలియన్ పేం షేడ్‌ను భర్తీ చేయనుంది. అలాగే రేసింగ్ బ్లూ కలర్‌కు కొన్ని గ్రాఫిక్స్ జత చేశారు.

Read Also: iQOO Neo 10: ఫ్లాగ్‌షిప్ ఫీచర్లతో లాంచ్‌కు సిద్దమైన ఐకూ నియో 10..!

అలాగే ముందు భాగంలో టెలిస్కోపిక్ ఫోర్క్, వెనుక ట్విన్ షాక్స్ సస్పెన్షన్ ఉన్నాయి. స్కూటర్ 14-అంగుళాల అల్లాయ్ వీల్స్ ఉన్నాయి. బ్రేకింగ్ కోసం ముందుభాగంలో డిస్క్ బ్రేక్, వెనుక డ్రమ్ బ్రేక్ కలదు. ఈ కొత్త స్కూటర్ మోడల్ ధరలు రూ. 1,50,130 (ఎక్స్‌షోరూమ్) నుండి ప్రారంభమవుతాయి. అయితే, అగ్రశ్రేణి S వేరియంట్ ధర రూ. 1,53,430 (ఎక్స్‌షోరూమ్)గా ఉంది. ఇక ఈ యమహా ఎయిరాక్స్ 155 స్కూటర్‌లో ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్ (TCS), సింగిల్ ఛానల్ ABS, ఆటోమేటిక్ స్టాప్ అండ్ స్టార్ట్ సిస్టమ్ (SSS), స్మార్ట్ కీ సిస్టమ్, యమహా Y-కనెక్ట్ బ్లూటూత్ కనెక్టివిటీ, నెగటివ్ LCD డిస్‌ప్లే, ఫుల్ LED లైటింగ్, సైడ్ స్టాండ్ ఇంజిన్ కట్-ఆఫ్ ఫంక్షన్ లాంటి పలు ఆధునిక సాంకేతిక ఫీచర్లు ఉన్నాయి.

Exit mobile version