దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి సినిమాతో ఆర్కా మీడియా వర్క్స్ ఎంతగానో పాపులర్ అయింది.ఈ బ్యానర్ లో తెరకెక్కిన మర్యాదరామన్న, వేదం వంటి సినిమాలు మంచి విజయం సాధించాయి.ఈ బ్యానర్ లో నిర్మాతలు ప్రసాద్ దేవినేని, శోభుయార్లగడ్డ పరంపరం,అన్యాస్ ట్యుటోరియల్ వంటి వెబ్‌సిరీస్‌లను కూడా నిర్మించారు.
ఇదిలా ఉంటే ప్రస్తుతం బాహుబలి ప్రొడ్యూసర్స్ తెలుగులో ఓ హారర్ వెబ్‌సిరీస్ చేస్తున్నారు.ఆర్కా మీడియా వర్క్స్ ఈ వెబ్‌సిరీస్‌కు యక్షిణి అనే టైటిల్‌ను ఫిక్స్ చేసింది. డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో ఈ వెబ్‌సిరీస్ స్ట్రీమింగ్ కాబోతోంది. శుక్రవారం ఈ వెబ్‌సిరీస్ ప్రీ లుక్ పోస్టర్ ను మేకర్స్ రిలీజ్ చేసారు. మేకర్స్ రిలీజ్ చేసిన పోస్టర్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది.యక్షిణి వస్తుంది..తస్మాత్ జాగ్రత్త అంటూ పోస్టర్‌ను ఉద్దేశించి ఇచ్చిన క్యాప్షన్ ప్రేక్షకులలో ఈ సిరీస్ పై మరింత ఆసక్తిని పెంచేసింది.
హారర్ కథాంశంతో తెరకెక్కుతోన్న ఈ వెబ్‌సిరీస్‌లో వేదిక, రాహుల్ విజయ్, అజయ్ మరియు మంచు లక్ష్మి ప్రధాన పాత్రల్లో కనిపించబోతున్నట్లు సమాచారం.అయితే ఈ సిరీస్ లో యక్షిణి గా వేదిక నటించనున్నట్లు సమాచారం. ఈ సిరీస్ లో వచ్చే ప్రతి హారర్ ఎలిమెంట్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకోనున్నట్లు మేకర్స్ తెలిపారు.యక్షిణి వెబ్‌సిరీస్ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ మరియు హిందీలో భాషల్లో స్ట్రీమింగ్ కానున్నట్లు సమాచారం. భారీ బడ్జెట్ తో ఆర్కా మీడియా వర్క్స్ బ్యానర్‌పై శోభుయార్లగడ్డ, ప్రసాద్ దేవినేని యక్షిణి వెబ్‌సిరీస్‌ను నిర్మిస్తున్నారు.అయితే ఈ సిరీస్ కు సంబంధించి దర్శకుడితో పాటు ఎన్ని ఎపిసోడ్స్‌తో ఈ సిరీస్ తెరకెక్కనుందన్నదనేది మేకర్స్ త్వరలోనే తెలియియజేయనున్నట్లు సమాచారం.
