13.3 అంగుళాల 3.4K 144Hz డిస్ప్లే, 12,000mAh బ్యాటరీతో Xiaomi Pad 9 Pro Max లాంచ్..!
- షియోమీ Pad 9 Pro Max టాబ్లెట్‌ను చైనా మార్కెట్లో అధికారికంగా లాంచ్
- 13.3 అంగుళాల 3.4K డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్
- టాబ్లెట్ మందం కేవలం 5.67 మి.మీ.
- పనితీరు కోసం Xiaomi XRING O3 AI ఫ్లాగ్షిప్ ప్రాసెసర్
- భారీ 12,000mAh బ్యాటరీతో పాటు 120W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్
- ఆడియో కోసం 8 స్పీకర్లు, డాల్బీ అట్మాస్, Hi-Res ఆడియో సపోర్ట్
- వెనుక 50MP మెయిన్ కెమెరా, ముందు 32MP సెల్ఫీ కెమెరా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Xiaomi Pad 9 Pro Max: ఆటం ఫ్లాగ్షిప్ ప్రొడక్ట్ లాంచ్ ఈవెంట్లో భాగంగా షియోమీ కొత్త ప్రీమియం టాబ్లెట్ షియోమీ పాడ్ 9 ప్రో మాక్స్ (Xiaomi Pad 9 Pro Max)ను అధికారికంగా లాంచ్ చేసింది. ఇందులో పెద్ద 13.3 అంగుళాల 3.4K డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, XRING O3 ప్రాసెసర్, 12,000mAh భారీ బ్యాటరీ, 120W ఫాస్ట్ ఛార్జింగ్ వంటి ఫీచర్లతో ఈ టాబ్లెట్‌ను లాంచ్ చేసింది.
144Hz డిస్ప్లే:
ఈ టాబ్లెట్ లో 13.3 అంగుళాల డిస్ప్లేను అందించారు. ఇది 3:2 యాస్పెక్ట్ రేషియో, 3408×2272 పిక్సెల్స్ 3.4K రిజల్యూషన్, 144Hz రిఫ్రెష్ రేట్‌తో వస్తుంది. గరిష్ఠంగా 1,000 నిట్స్ బ్రైట్నెస్ను అందిస్తుంది. స్క్రీన్‌పై ప్రతిబింబాలు, గ్లేర్‌ను తగ్గించేందుకు ప్రత్యేకంగా “నానో సాఫ్ట్ లైట్” డిస్ప్లే ఎడిషన్‌ను కూడా షియోమీ అందిస్తోంది.
Also Read
ప్రీమియం మెటల్ యూనిబాడీ డిజైన్‌తో రూపొందించిన ఈ టాబ్లెట్ మందం కేవలం 5.67 మి.మీ. మాత్రమే. స్టాండర్డ్ ఎడిషన్ బరువు 645 గ్రాములు కాగా, సాఫ్ట్ లైట్ ఎడిషన్ బరువు 653 గ్రాములు. రిచ్ వైన్ రెడ్, బ్లాక్, సిల్వర్ రంగుల్లో ఈ టాబ్లెట్ అందుబాటులో ఉంటుంది.
XRING O3 ప్రాసెసర్:
పెర్ఫార్మెన్స్ కోసం Xiaomi XRING O3 AI ఫ్లాగ్షిప్ ప్రాసెసర్‌ను ఉపయోగించారు. TSMC 3nm టెక్నాలజీ ఆధారంగా రూపొందించిన ఈ డెకా-కోర్ ప్రాసెసర్ గరిష్ఠంగా 4.35GHz క్లాక్ స్పీడ్‌ను అందిస్తుంది. ఇందులో 4-కోర్ Xuanjie NPU కూడా ఉంది. డెస్క్‌టాప్-స్థాయి పనితీరును అందించేలా చిప్‌సెట్‌ను రూపొందించినట్లు షియోమీ పేర్కొంది. అలాగే ఇందులోని ర్యామ్ విషయంలో 8GB, 12GB, 16GB ఆప్షన్లు ఉన్నాయి. LPDDR5X, LPDDR5T, LPDDR6 మెమరీ టెక్నాలజీలను వేరియంట్‌ను బట్టి అందించారు. స్టోరేజ్ 256GB నుంచి 1TB వరకు ఉంటుంది.
12,000mAh బ్యాటరీ..
టాబ్లెట్‌లో భారీ 12,000mAh బ్యాటరీని అందించారు. దీనికి 120W షియోమీ సర్జ్ ఛార్జ్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది. పెద్ద డిస్ప్లేతో ఎక్కువసేపు పనిచేసే యూజర్లను దృష్టిలో ఉంచుకుని భారీ బ్యాటరీని అందించారు. మరోవైపు ఆడియో విభాగంలో.. 8 స్పీకర్లను అందించారు. వీటికి డాల్బీ అట్మాస్, Hi-Res ఆడియో సపోర్ట్ ఉంది. అలాగే వాయిస్ రికార్డింగ్, నాయిస్ క్యాన్సిలేషన్ కోసం 6 మైక్రోఫోన్లను అందించారు.
50MP కెమెరా..
వెనుక భాగంలో LED ఫ్లాష్‌తో 50MP ప్రధాన కెమెరా ఉంది. ఇది 4K 60fps వరకు వీడియో రికార్డింగ్ చేయగలదు. ముందు భాగంలో 32MP కెమెరాను అందించారు. ఇది 1080p 60fps వీడియో రికార్డింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. ఇంకా కనెక్టివిటీ కోసం Wi-Fi 7, Bluetooth 6.0, USB Type-C 3.2 Gen 2 పోర్ట్ ఉన్నాయి. ఇందులోని DP-in ఆడియో/వీడియో ఇన్పుట్ ఫీచర్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. దీని ద్వారా టాబ్లెట్‌ను రెండో PC మానిటర్‌గా, డిజిటల్ డ్రాయింగ్ డిస్ప్లేగా లేదా గేమింగ్ కన్సోల్కు ఎక్స్టర్నల్ స్క్రీన్‌గా ఉపయోగించుకోవచ్చు.
మల్టీటాస్కింగ్..
Xiaomi Pad 9 Pro Maxలో పెద్ద స్క్రీన్‌ను పూర్తిగా ఉపయోగించుకునేలా HyperOS 4ను అందించారు. WPS for Pad, CapCut Pro, Pixel Cake వంటి ప్రొఫెషనల్ యాప్స్‌కు ప్రత్యేక ఆప్టిమైజేషన్ ఉంది. మల్టీటాస్కింగ్‌లో ఒకేసారి ఆరు విండోలను నిర్వహించే అవకాశం ఉంది. డ్యూయల్ స్క్రీన్ మోడ్‌లో స్క్రీన్ విభజనను అవసరానికి అనుగుణంగా మార్చుకోవచ్చు. మూడు స్క్రీన్ మోడ్‌లో మూడు యాప్స్‌ను ఒకేసారి ఉపయోగించవచ్చు. సిక్స్-స్క్రీన్ మోడ్‌లో ఆరు యాప్స్‌తో భారీ మల్టీటాస్కింగ్ చేయవచ్చు.
Xiaomi Pad 9 Pro Max ధర:
ఇప్పటికే చైనా మార్కెట్లో ఇది అమ్మకలకు అందుబాటులోకి వచ్చింది. భారత్‌లో ఈ టాబ్లెట్ విడుదలపై ప్రస్తుతానికి ఎలాంటి అధికారిక సమాచారం లేదు. చైనాలో Xiaomi Pad 9 Pro Max ధరలు ఇలా ఉన్నాయి..
* 8GB + 256GB: 4,799 యువాన్ — రూ.67,530
* 12GB + 256GB: 5,299 యువాన్ — రూ.74,565
* 16GB + 256GB: 5,799 యువాన్ — రూ.81,600
* 12GB + 512GB: 6,099 యువాన్ — రూ.85,825
* 16GB + 512GB: 6,599 యువాన్ — రూ.92,860
* 16GB + 512GB Soft Light: 6,899 యువాన్ — రూ.97,080
* 16GB + 1TB Soft Light: 7,899 యువాన్ — రూ.1.11 లక్షలు
* Floating Keyboard యాక్సెసరీ ధర 1,099 యువాన్ — రూ.15,465గా ఉంది.
తాజావార్తలు
-
13.3 అంగుళాల 3.4K 144Hz డిస్ప్లే, 12,000mAh బ్యాటరీతో Xiaomi Pad 9 Pro Max లాంచ్..!
-
Viral News: రీల్ కోసం నీటిలో దూకాడు.. నెక్ట్స్ ఏం జరిగిందో తెలిస్తే తల పట్టుకుంటారు..!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ.. ఎలా ఆడాలో ఇషాన్ కిషన్‌ను చూసి నేర్చుకో!
-
Donald Trump: చమురు ధరలపై ట్రంప్ సంచలన ప్రకటన.. 2 డాలర్ల దిగువకు..!
-
7.58 అంగుళాల ఫోల్డబుల్ డిస్ప్లే, 6000mAh బ్యాటరీ, 200MP లైకా కెమెరాతో Xiaomi 18 Fold లాంచ్.!
ట్రెండింగ్
-
93 గంటల ఆడియో ప్లేబ్యాక్, 120Hz డిస్ప్లే, 50MP కెమెరాతో iQOO Z11xa 5G లాంచ్.. ధర కూడా తక్కువే.!
-
KKR Captain: టీమిండియా నుంచి తప్పించారు.. కట్ చేస్తే కప్ కొట్టాడు.. ఇప్పుడు కేకేఆర్కే బాస్..!
-
Rajat Patidar: ఇంకెవరి సపోర్ట్ అవసరం లేదు.. ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్ షాకింగ్ కామెంట్స్!
-
లగ్జరీ లుక్‌తో Tecno కొత్త ఫోన్.. Tonino Lamborghini ఎడిషన్‌లో అదిరిపోయే ఫీచర్లు.!
-
స్వరోవ్స్కీ క్రిస్టల్స్‌తో Motorola Razr స్పెషల్ ఎడిషన్.. లగ్జరీ లుక్‌తో ఫ్లిప్ ఫోన్ అదుర్స్ అంతే.!