Site icon NTV Telugu

Xiaomi MIX Flip 2: ఫోల్డబుల్ డిజైన్, లైకా కెమెరాతో షియోమి MIX Flip 2 విడుదల.. ధర, స్పెసిఫికేషన్లు ఇలా..!

Xiaomi Mix Flip 2

Xiaomi Mix Flip 2

Xiaomi MIX Flip 2: షియోమి కొత్త ఫోల్డబుల్ ఫోన్ MIX Flip 2ను అధికారికంగా విడుదల చేసింది. గత మోడల్‌తో పోలిస్తే డిజైన్, కెమెరా, ప్రాసెసర్, డిస్‌ప్లే, AI ఫీచర్లు మరింత అప్డేటెడ్ అయ్యాయి. తాజా వేరియంట్ ప్రీమియం హార్డ్‌వేర్, ఫ్యూచరిస్టిక్ ఫోల్డబుల్ డిజైన్‌తో కూడి ఉంది.

డిస్‌ప్లే, డిజైన్:
MIX Flip 2 ట్రిపుల్-కర్వ్ ఫోల్డబుల్ AMOLED డిస్‌ప్లేతో వస్తోంది. ఈ మొబైల్ ను తెరిచినపుడు సీమ్‌లెస్‌గా, మూసినపుడు స్మూత్‌గా అనిపించేలా రూపొందించారు. ఫ్రేమ్ ఫ్రాస్టెడ్ మెటల్‌తో ఉండి, గ్రీప్ మెరుగ్గా ఉండేలా చేస్తుంది. ఫోన్ వెడల్పు 73.8mm ఉండగా.. ముడిచినపుడు 15.87mm మందంగా ఉంటుంది. మొబైల్ బరువు 199 గ్రాములు మాత్రమే. ఇది SGS, CQC నుండి 2 లక్షల మడతలకు సర్టిఫికేషన్ పొందింది.

Read Also:Ahmedabad Plane Crash: టాటా గ్రూప్ కీలక నిర్ణయం.. బాధిత కుటుంబాల కోసం రూ.500 కోట్లతో ట్రస్ట్ ఏర్పాటు

అలాగే అవుటర్ డిస్‌ప్లే 4.01 అంగుళాల AMOLED స్క్రీన్, 1.5K రెజల్యూషన్, 120Hz రిఫ్రెష్ రేట్, 3200 నిట్స్ బ్రైట్‌నెస్ కలిగి ఉంది. 16:9 లేఅవుట్‌ లో 500కి పైగా యాప్స్‌ కు సపోర్ట్, మెసేజ్ ప్రీవ్యూస్, కాల్స్, QR స్కానింగ్ వంటి ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి. ఇక ఇన్నర్ డిస్‌ప్లే ను చూస్తే.. 6.86-ఇంచ్ ఫోల్డబుల్ AMOLED డిస్‌ప్లే, 1.5K రెజల్యూషన్, డైనమిక్ 1–120Hz రిఫ్రెష్ రేట్, HDR10+, డాల్బీ విజన్, వెట్ టచ్, 3200 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌ తో వస్తుంది.

ప్రాసెసర్:
ఈ ఫోన్‌లో శక్తివంతమైన Snapdragon 8 Elite చిప్‌సెట్ ఉంది. దీని గరిష్ట క్లాక్ స్పీడ్ 4.32GHz. ఇందులో 16GB వరకు LPDDR5X RAM, 1TB వరకు UFS 4.1 స్టోరేజ్ లభిస్తుంది. అధునాతన డ్యూయల్ వెపర్ ఛాంబర్ కూలింగ్ సిస్టమ్ వేడి నియంత్రణను మెరుగుపరుస్తుంది.

Read Also:Rajnath Singh: చైనాతో ఉద్రిక్తతలకు ముగింపు దిశగా భారత్‌.. 4 అంశాల ఫార్ములా..

బ్యాటరీ:
Xiaomi MIX Flip 2 లో 5165mAh హై-సిలికాన్ బ్యాటరీ ఉండి, 67W వైర్డ్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. అలాగే 50W వైర్లెస్ ఫాస్ట్ చార్జింగ్ కు సపోర్ట్ చేస్తుంది.

కెమెరా:
Xiaomi MIX Flip 2 మొబైల్ 50MP ప్రాధమిక కెమెరా (OV50E, 1/1.55-ఇంచ్ సెన్సార్), Leica Summilux 23mm f/1.7 లెన్స్, OIS సపోర్ట్, 50MP అల్ట్రా-వైడ్ కెమెరా, 14mm ఫోకల్ లెంగ్త్, 5cm మ్యాక్రో ఫోకస్, 32MP ఫ్రంట్ కెమెరా, 4K వీడియో రికార్డింగ్ లను కలిగి ఉంది. వీడియోలను డైనమిక్ ఫోటోలుగా మార్చే ఫీచర్‌తో పాటు, ఫ్రీ-యాంగిల్ షూటింగ్ మోడ్ కూడా అందుబాటులో ఉంది.

ఇక ఇతర ఫీచర్ల విషయానికి వస్తే.. ఇందులో డ్యుయల్ 5G SIM, Wi-Fi 7, Bluetooth 5.4, NFC, IR బ్లాస్టర్, స్టీరియో స్పీకర్లు, డాల్బీ ఆటమ్స్ సపోర్ట్, Xiaomi Starlight సిస్టమ్ అందుబాటులో ఉన్నాయి. అలాగే ఇందులో HyperOS 2 ఆపరేటింగ్ సిస్టమ్, Super Xiao Ai వాయిస్ అసిస్టెంట్, Always-On డిస్‌ప్లేలో పెట్ అనిమేషన్‌లు, Xiaomi కార్ ఇన్ఫోటైన్మెంట్ కంట్రోల్, iPhoneలతో ఫైల్ షేరింగ్, Xiaomi Cloudలో iCloud ఫోటో బ్యాకప్ ఫీచర్లు ఉన్నాయి. ఈ మొబైల్ వైట్, పర్పుల్, గ్రీన్, చెకర్డ్ గోల్డ్ రంగులలో లభిస్తుంది.

ధర:
* 12GB + 256GB – 5999 యువాన్స్ (రూ. 71,615)

* 12GB + 512GB – 6499 యువాన్స్ (రూ.77,585)

* 16GB + 1TB – 7299 యువాన్స్ (రూ.87,135)

Exit mobile version