Xiaomi FX Pro QLED 4K Fire TV: షియోమీ (Xiaomi) నుంచి వచ్చిన 138 సెం.మీ (55 అంగుళాలు) FX Pro QLED Ultra HD 4K Smart Fire టీవీ ఇప్పుడు ఏకంగా రూ. 30,000 భారీ డిస్కౌంట్‌తో కేవలం రూ. 32,999కే అందుబాటులోకి వచ్చింది. ఈ టీవీ అసలు ధర రూ. 62,999 కాగా.. 48% భారీ డిస్కౌంట్ లభిస్తుంది. ఈ టీవీలో QLED డిస్‌ప్లే ఉండటంతో రంగులు మరింత స్పష్టంగా, బ్రైట్‌గా కనిపిస్తాయి. 4K Ultra HD (3840×2160) రిజల్యూషన్, HDR10+, HDR10, HLG సపోర్ట్‌తో సినిమాలు, సిరీస్‌లు chala. Reality Flow MEMC టెక్నాలజీ వల్ల ఫాస్ట్ మూవింగ్ సీన్స్ కూడా స్మూత్‌గా కనిపిస్తాయి.
సౌండ్ విషయంలో కూడా ఇది టాప్ క్లాస్ గా నిలుస్తుంది. ఇందులో 34W స్పీకర్ అవుట్‌పుట్, డాల్బీ ఆడియో, DTS-X, DTS Virtual:X సపోర్ట్‌తో థియేటర్‌లాంటి ఆడియో అనుభవం లభిస్తుంది. Fire TV Built-in కావడంతో ప్రైమ్ వీడియో, నెట్ఫ్లిక్, డిస్నీ+ హాట్ స్టార్, యూట్యూబ్ వంటి యాప్స్‌తో పాటు 12,000+ యాప్స్ ఉపయోగించవచ్చు. అలెక్సా వాయిస్ రిమోట్ ద్వారా వాయిస్‌తోనే టీవీని కంట్రోల్ చేయొచ్చు. అలాగే DTH సెటప్ బాక్స్ ఇంటిగ్రేషన్ కూడా ఉంది.
Chennai: పెళ్లై 9 రోజులు కూడా కాకముందే భార్య హత్య, భర్త ఆత్మహత్య..!
ఇక కనెక్టివిటీ పరంగా.. 3 HDMI పోర్ట్స్, 2 USB పోర్ట్స్, Wi-Fi & బ్లూటూత్, క్రోమ్ కాస్ట్ సపోర్ట్ ఉన్నాయి. అలాగే ఇందులో బీజెల్-లెస్ డిజైన్, 60Hz రిఫ్రెష్ రేట్, 178° వైడ్ వ్యూయింగ్ యాంగిల్, 32GB స్టోరేజ్, 2GB ర్యామ్ ఉన్నాయి. ఇక ఈ టీవీకి 1 సంవత్సరం కంప్రిహెన్సివ్ వారంటీ అందుతుంది. ఇక 1,584 నుంచి No-Cost EMI అందుబాటులో ఉంది. అలాగే HDFC క్రెడిట్ కార్డ్ EMIపై అదనపు ఇన్‌స్టంట్ డిస్కౌంట్స్ కూడా ఉన్నాయి.
