2025 దీపావళి సందర్భంగా ‘షావోమీ ఇండియా’ తన కస్టమర్లకు పండుగ సేల్‌ను తీసుకొచ్చింది. సెప్టెంబర్ 22 నుంచి షావోమీ దీపావళి సేల్ ప్రారంభం కానుంది. ఈ సేల్‌లో ఎంఐ.కామ్, అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ సహా ఆఫ్‌లైన్ రిటైల్ భాగస్వాములతో కలిసి అద్భుతమైన డిస్కౌంట్లను అందిస్తుంది. సేల్ సమయంలో వినియోగదారులు స్మార్ట్‌ఫోన్‌లపై 45 శతం వరకు, క్యూఎల్‌ఈడీ స్మార్ట్ టీవీలపై 55 శతం వరకు టాబ్లెట్‌లపై 60 శతం వరకు ఆదా చేసుకోవచ్చు.
షావోమీ దీపావళి పండుగ సీజన్‌లో రెడ్‌మీ నోట్ 14 ప్రో ప్లస్ 5జీ ఇప్పుడు రూ.24,999కే అందుబాటులో ఉంది. గతంలో ఈ ఫోన్ రూ.34,999గా ఉంది. రెడ్‌మీ నోట్ 14 ప్రో 5జీ రూ.20,999కి మీ సొంతం అవుతుంది. రూ.21999 రెడ్‌మీ నోట్ 14 ఫోన్ రూ.15,499కే అందుబాటులో ఉంది. రెడ్‌మీ నోట్ 14 ఎస్ఈ రూ.12999కి.. రెడ్‌మీ 15 రూ.14999కి.. రెడ్‌మీ A4 5జీ రూ.7499కి.. రెడ్‌మీ 14సీ రూ.8999కి మీరు సొంతం చేసుకోవచ్చు. ఈ స్మార్ట్‌ఫోన్‌లన్నీ స్టైలిష్ డిజైన్, భారీ బ్యాటరీ, ఏఐ ఫీచర్స్ కలిగి ఉన్నాయి.
టాబ్లెట్లపై డిస్కౌంట్ :
షావోమీ ప్యాడ్ 7: 22,999 (గతంలో 34,999)
షావోమీ ప్యాడ్ ప్రో: 16,999 (గతంలో 24,999)
షావోమీ ప్యాడ్ 2: 11,999
రెడ్‌మీ ప్యాడ్ ఎస్ఈ 4జీ: 7,999
Also Read: iPhone 16 Pro Price Drop: ఇదే బెస్ట్ డీల్, అస్సలు మిస్ అవ్వొద్దు.. 34 వేలకే ఐఫోన్ 16 ప్రో!
స్మార్ట్ టీవీ ఆఫర్లు:
Xiaomi CineMagiQLED X Pro సిరీస్: 25,999 (గతంలో 44,999)
FantastiQLED FX ప్రో సిరీస్: 21,999 (గతంలో 44,999)
పవర్‌బ్యాంక్ ఆఫర్లు:
రెడ్‌మి 4i 20K పవర్‌బ్యాంక్: 1,899
రెడ్‌మి వాచ్ మూవ్: 1,699
రెడ్‌మి బడ్స్ 5C: 1,799
షియోమి స్మార్ట్ ఎయిర్ ప్యూరిఫైయర్ 4 లైట్: 12,999
షియోమి గ్రూమింగ్ కిట్: 1,599
