Site icon NTV Telugu

Xiaomi 17 వచ్చేస్తోంది.. 7,000mAh బ్యాటరీతో పాటు కిర్రాక్ ఫీచర్లు

Xiaomi 17

Xiaomi 17

Xiaomi 17: భారత స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో త్వరలో మరో ఫ్లాగ్‌షిప్ ఫోన్ సందడి చేయనుంది. బడ్జెట్ నుంచి ప్రీమియం సెగ్మెంట్ వరకు మంచి క్రేజ్ ఉన్న షియోమీ.. తన కొత్త హైఎండ్ స్మార్ట్‌ఫోన్ Xiaomi 17 ను భారత్‌లో త్వరలో లాంచ్ చేసే అవకాశం ఉందని టెక్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అయితే, దీనిపై కంపెనీ నుంచి అధికారిక ప్రకటన ఇంకా రాలేదు. కాగా, ఈ ఫోన్‌కు సంబంధించిన ఇండియన్ వేరియంట్‌ Bureau of Indian Standards (BIS) వెబ్‌సైట్‌లో కనిపించినట్లు లీక్స్ వచ్చాయి.

Read Also: TheRajaSaab : రేపే రాజాసాబ్ ప్రీ రిలీజ్ ఈవెంట్.. కానీ వెన్యూ మారింది..

BIS సర్టిఫికేషన్‌లో Xiaomi 17?
BIS సర్టిఫికేషన్‌లో 25113PN0EI అనే మోడల్ నంబర్‌తో ఓ షియోమీ ఫోన్ R-41314803 నెంబర్ తో రిజిస్ట్రర్ అయింది. ఈ లిస్టింగ్‌లో స్పెసిఫికేషన్స్ బయటకు రాకపోయినా, భారత్ లో త్వరలోనే లాంచ్ చేసేందుకు సమయం దగ్గర్లోనే ఉండొచ్చు అనే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అయితే, గత కొన్ని వారాల్లో ఈ ఫోన్ థాయిలాండ్ NBTC, సింగపూర్ IMDA లాంటి సర్టిఫికేషన్ ప్లాట్‌ఫామ్‌లలో కూడా దర్శనమిచ్చింది. తాజాగా Geekbenchలో గ్లోబల్ వేరియంట్‌ స్నాప్ డ్రాగన్ 8 Elite Gen 5, 12GB RAM, Android 16 OSతో లిస్ట్ అయింది

Read Also: AI Danger For Kids: ‘చ*చ్చిపోవాలని ఉంది..!’ ప్రమాదంలో పిల్లల ప్రాణాలు.. ఈ తప్పులు చేయవద్దు!

చైనాలో ఇప్పటికే లాంచ్ అయిన Xiaomi 17..
సెప్టెంబర్‌లోనే చైనాలో Xiaomi 17, 17 Pro సిరీస్‌తో కలిసి విడుదలైంది. ఇది షియోమీ బ్రాండ్‌కు తొలి పూర్తిస్థాయి పవర్‌ఫుల్ కాంపాక్ట్ ఫ్లాగ్‌షిప్ ఫోన్ గా గుర్తింపు తెచ్చుకుంది. ఇక, Xiaomi 17 భారత్‌లో లాంచ్ అయితే, ఇప్పటికే ఉన్న Galaxy S Ultra, OnePlus, iQOO, Pixel లాంటి ప్రీమియం ఫోన్లకు గట్టి పోటీ ఇవ్వనుంది.

ధర వివరాలు
* చైనా మార్కెట్‌లో ప్రారంభ ధర: CNY 4,499 (సుమారు ₹56,000)
* బేస్ వేరియంట్: 12GB RAM + 256GB Storage
* భారత్‌లో కూడా ఇదే ధరతో లాంచ్ అయ్యే అవకాశం ఉందని రూమర్స్
* హార్డ్‌వేర్ కూడా చైనా వేరియంట్‌ను పోలి ఉండొచ్చు అని టాక్

అంచనా స్పెసిఫికేషన్స్
డిస్‌ప్లే:
6.3-అంగుళాల 1.5K OLED
120Hz రిఫ్రెష్ రేట్

ప్రాసెసర్:
క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5 చిప్‌సెట్

కెమెరా:
వెనక లైకా-ట్యూన్ చేసిన ట్రిపుల్ కెమెరా సెటప్
50MP Primary (Light Fusion 950 Sensor + OIS)
50MP Telephoto
50MP Ultra-wide
50MP Front సెల్ఫీ కెమెరా

స్టోరేజ్ & RAM:
16GB RAM
1TB స్టోరేజీ

బ్యాటరీ & ఛార్జింగ్:
7,000mAh భారీ బ్యాటరీ
100W Wired Fast Charging
50W Wireless Fast Charging

Exit mobile version