Site icon NTV Telugu

WTC Final Chances: దక్షిణాఫ్రికా చేతిలో 0-2 పరాజయం తర్వాత కూడా భారత్‌కి WTC ఫైనల్ అవకాశాలు ఉన్నాయా?

India (1)

India (1)

WTC Final Chances: దక్షిణాఫ్రికాతో స్వదేశంలో జరిగిన రెండు టెస్టుల సిరీస్‌లో 0-2 తో వైట్ వాష్ ఎదుర్కొన్న టీమిండియా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌ (WTC) ఫైనల్ రేసులో భారీ దెబ్బతిన్నది. గౌహతిలో జరిగిన రెండో టెస్టులో 408 పరుగుల పరాజయం భారత్ టెస్ట్ క్రికెట్ చరిత్రలో అతి పెద్ద రన్ తేడా ఓటమిగా నమోదైంది. ఈ వైట్‌వాష్ ఫలితంగా భారత్ ర్యాంకింగ్స్‌లో ఐదో స్థానానికి పడిపోయింది. దీనితో ప్రస్తుతం ఇండియా PCT (Percentage of Points) 48.15గా ఉంది.

Biker: శర్వానంద్ ‘బైకర్’ రిలీజ్ డేట్ పోస్ట్ పోన్.. ఇట్స్ అఫీషియల్

భారత్ ప్రస్తుత WTC సైకిల్‌లో (2025-27) భారత్ ఇప్పటివరకు 9 టెస్టులు ఆడింది. అందులో నాలుగు విజయాలు, నాలుగు పరాజయాలు, ఒక డ్రా సాధించింది. ఇంగ్లండ్‌తో సిరీస్ డ్రా కావడం, అనంతరం స్వదేశంలో దక్షిణాఫ్రికా చేతిలో వైట్‌వాష్ కావడం భారత స్థితిని మరింత కఠినతరం చేసింది. ఇక దక్షిణాఫ్రికా విషయానికి వస్తే 25 సంవత్సరాల తర్వాత భారత్‌తో టెస్ట్ సిరీస్ గెలుచుకోవడంతో వారి స్థానం మరింత బలపడింది. ప్రస్తుతం వారు ఆస్ట్రేలియా తర్వాత రెండో స్థానంలో 75% PCTతో నిలిచారు. న్యూజిలాండ్ ఇంకా ఒక్క సిరీస్‌ను కూడా ఆడలేదు. శ్రీలంక, పాకిస్తాన్ ఒక్కో సిరీస్ ఆడగా.. టాప్-2 జట్లు 2027లో జరగనున్న WTC ఫైనల్‌కు అర్హత పొందుతాయి.

ఇంకా భారత్‌కు అవకాశం ఎలా ఉంది?
భారత్‌కు ఇంకా ఈ WTC సైకిల్‌లో మొత్తం 9 టెస్టులు మిగిలి ఉన్నాయి. ఈ మ్యాచ్‌లలో ఫలితాలు ఇలా ఉంటే భారత్‌కి అవకాశాలు నిలుస్తాయి.
* ఒకవేళ అన్ని 9 మ్యాచ్‌లు గెలిస్తే – 74.1%

* 7 విజయాలు, 1 డ్రా, 1 పరాజయం – 64.8%

* 6 విజయాలు, 2 డ్రాలు, 1 పరాజయం – 61.1%

* 6 విజయాలు, 1 డ్రా, 2 పరాజయాలు – 59.3%

Apple MacBook Air M1: ఆపిల్ మ్యాక్‌బుక్ ఎయిర్ M1 రూ.50,000 కంటే తక్కువ ధరకే.. త్వరపడండి

అంటే ప్రాక్టికల్‌గా భారత్ టాప్ 2లోకి రావాలంటే కనీసం 6 టెస్టులు తప్పనిసరిగా గెలవాలి. భారత్‌కు మిగిలిన సిరీస్‌లు (2026-27) చూస్తే.. శ్రీలంక vs భారత్ 2 టెస్టులు ఆగస్టు-2026, న్యూజిలాండ్ vs భారత్ 2 టెస్టులు అక్టోబర్–డిసెంబర్ 2026, భారత్ vs ఆస్ట్రేలియా 5 టెస్టులు జనవరి–ఫిబ్రవరి 2027 లో జరగనున్నాయి. ఈ తొమ్మిది టెస్టుల్లో భారత జట్టు కనీసం 6 గెలవాల్సిందే. లేకుంటే WTC ఫైనల్ రేసులో నిలిచే అవకాశాలు చాలా తగ్గిపోతాయి.

Exit mobile version