NTV Telugu Site icon

Mumbai: ఇండియాకు పాకిన పాలస్తీనా నినాదం.. స్కూల్ ప్రిన్సిపాల్ తొలగింపు

Ke

Ke

గత రెండు నెలలుగా హమాస్-ఇజ్రాయెల్ మధ్య భీకరమైన యుద్ధం సాగుతోంది. అక్టోబర్ 7న హమాస్ హఠాత్తుగా ఇజ్రాయెల్‌పై దాడి చేసింది. అనంతరం ప్రతీకారంగా ఇజ్రాయెల్.. హమాస్ లక్ష్యంగా దాడులకు తెగబడింది. వందలాది మంది పాలస్తీనీయులు ప్రాణాలు కోల్పోయారు. తాజాగా రఫాలోని హమాస్ టార్గెట్‌గా ఇజ్రాయెల్ ముట్టడి వేసింది. వారి అంతమే లక్ష్యమని ఇజ్రాయెల్ ప్రకటించింది. అయితే ఇజ్రాయెల్ జరిగిస్తున్న మారణహోమానికి నిరసనగా ఇటీవల అమెరికాలోని యూనివర్సిటీ విద్యార్థుల ఆందోళనలతో దద్దరిల్లాయి. అప్రమత్తం అయిన అమెరికా పోలీసులు.. నిరసనలపై ఉక్కుపాదం మోపారు. ఎక్కడికక్కడే ఆందోళనలను, నిరసనలను అణగదొక్కారు. కేసులు నమోదు చేసి.. విశ్వవిద్యాలయాల నుంచి బయటకు పంపేశారు. మరోవైపు ఇజ్రాయెల్‌కు అమెరికా మద్దతు ఉపసంహరించుకునే వరకు పోరాటం ఆగదని విద్యార్థి సంఘాలు ప్రకటించాయి. ఇదిలా ఉంటే పాలస్తీనా అనుకూల ఉద్యమం తాజాగా ఇండియాకు పాకింది. ముంబైలోని ఓ స్కూల్ ప్రిన్సిపల్.. పాలస్తీనాకు అనుకూలంగా పోస్టులు పెట్టడంతో యాజమాన్యం ఉద్యోగం నుంచి తొలగించింది.

ఇది కూడా చదవండి: RBI: రూ. 20,000 నగదు రుణాల పరిమితిని పాటించాలి.. నాన్-బ్యాంక్స్‌కి ఆర్బీఐ ఆదేశం..?

ముంబైలోని ఒక ఉన్నత పాఠశాలలో పర్వీన్ షేక్ ప్రిన్సిపల్‌గా పని చేస్తున్నారు. ఆమె సామాజిక మాధ్యమాల్లో ఎక్కువగా పాలస్తీనాకు మద్దతుగా పోస్టులు పెడుతూ వస్తున్నారు. పాఠశాల విలువలకు విరుద్ధంగా ఆమె వ్యవహరించడంతో సోమయ్య స్కూల్ మేనేజ్‌మెంట్ సీరియస్‌గా తీసుకుంది. ఆమె కార్యకలాపాలు.. సంస్థ యొక్క సూత్రాలకు విరుద్ధంగా ఉన్నాయన్న కారణంతో ఆమెను తొలగిస్తున్నట్లు స్కూల్ యాజమాన్యం ప్రకటించింది.

ఇది కూడా చదవండి: Young Voters: 2024 లోక్‌సభ ఎన్నికల్లో తొలిసారిగా ఎన్ని కోట్ల మంది యువత ఓటు వేస్తున్నారు..?

ప్రిన్సిపల్ పర్వీన్ షేక్ మాత్రం.. యాజమాన్యం నిర్ణయాన్ని తప్పుపట్టారు. తొలగింపు వార్త తెలిసి షాక్ అయినట్లు చెప్పారు. టెర్మినేషన్ నోటీసు అందుకోకముందే తనను తొలగించడం చట్ట విరుద్ధం అన్నారు. 12 ఏళ్లుగా పాఠశాల అభివృద్ధికి కృషి చేసినట్లు చెప్పుకొచ్చారు. నిజాయితీ, అంకితభావంతో పని చేసినట్లు ఆమె తెలిపారు.

ఏడేళ్ల క్రితమే పర్వీన్ షేక్ పాఠశాల ప్రిన్సిపల్‌గా బాధ్యతలు చేపట్టారు. సోషల్ మీడియాలో ఆమె పెడుతున్న పోస్టులపై గతంలోనే యాజమాన్యం సీరియస్ అయింది. రాజీనామా చేయాలని కోరింది. ఆమె నుంచి వ్రాతపూర్వక వివరణ కోరింది. ఆమె సమాధానం కోసం వేచి చూస్తున్న సమయంలోనే వేటు పడింది.

ఈ చర్య రాజకీయ ప్రేరేపితమైనదిగా కనిపిస్తోందని పర్వీన్ షేక్ అభిప్రాయపడింది. ఈ మేరకు ఆమె సోషల్ మీడియాలో వ్యాఖ్యానించింది. తనకు న్యాయ వ్యవస్థ, భారత రాజ్యాంగంపై నమ్మకం ఉందన్నారు. న్యాయప్రకారం పోరాటం చేస్తానని ఆమె ప్రకటించారు.

ఇది కూడా చదవండి: Telangana Tourism: శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్.. ఒక్క రోజులో తిరుమల ట్రిప్.. ఫ్రీగా శీఘ్రదర్శనం..