Site icon NTV Telugu

Lopaliki Ra Chepta: ‘లోపలికి రా చెప్తా’ అంటున్నారేంట్రా.. ట్రైలర్ రిలీజ్

Lopaliki Ra Chepta (1)

Lopaliki Ra Chepta (1)

Lopaliki Ra Chepta: ప్రముఖ రచయిత విజయేంద్రప్రసాద్ చేతుల మీదుగా ‘లోపలికి రా చెప్తా’ ట్రైలర్ లాంచ్ అయ్యింది. మాస్ బంక్ మూవీస్ పతాకంపై హర్రర్ బేస్డ్ కామెడీ ఎంటర్టైనర్ గా కొండా వెంకట రాజేంద్ర, మనిషా జష్నాని, సుస్మిత అనాలా, సాంచిరాయ్ తారాగణంగా లక్ష్మీ గణేష్, వెంకట రాజేంద్ర సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ‘లోపలికి రా చెప్తా’. కొండా వెంకట రాజేంద్ర హీరోగా నటించడమే కాకుండా.. ఈ చిత్రానికి కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వ బాధ్యతలను కూడా నిర్వహిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటి వరకు విడుదలైన పాటలు, పోస్టర్స్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది.

Read Also:Euphoria: తల్లిదండ్రులు త‌ప్ప‌కుండా చూడాల్సిన సినిమా: భూమిక చావ్లా

జూలై 5న ప్రపంచవ్యాప్తంగా ‘లోపలికి రా చెప్తా’ చిత్రం గ్రాండ్‌గా థియేటర్లలో విడుదల కాబోతోంది. తాజాగా హైదరాబాద్ లో ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రచయిత విజయేంద్రప్రసాద్ మాట్లాడుతూ.. ‘లోపలికి రా చెప్తా’ సినిమా ట్రైలర్ లాంచ్ కు అతిథిగా రావడం సంతోషంగా ఉందని.. ట్రైలర్ చూశాక మీలో భయం కలిగే ఉంటుందని అన్నారు. అయితే, మనల్ని భయపెట్టే విషయాలు ఈ సినిమాలో లాగే బయట కూడా చాలా జరుగుతున్నాయి. ‘లోపలికి రా చెప్తా’ సినిమా ప్రేక్షకుల్ని భయపెట్టడమే కాదు, వారి దగ్గర నుంచి మంచి కలెక్షన్స్ కూడా రాబట్టాలని ఈ సినిమా టీమ్ కు నా బెస్ట్ విశెస్ అందిస్తున్నన్నారు.

Read Also:Euphoria: 20 మంది కొత్త వారిని ప‌రిచ‌యం చేశా.. సాంగ్ లాంచ్ ఈవెంట్‌లో డైరెక్ట‌ర్..!

అలాగే దర్శకుడు కొండా విజయ్ కుమార్ మాట్లాడుతూ.. కొండా వెంకట రాజేంద్ర నా మిత్రుడని.. ఆయన కోసమే ఈ కార్యక్రమానికి వచ్చానని అన్నారు. మంచి ఐడియాస్ తో ఆయన సినిమాలు చేస్తుంటారు. ఈ సినిమా కూడా మంచి విజయాన్ని సాధించి ఆయనకు పేరు తీసుకురావాలని కోరుకుంటున్నారు. మూవీ టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్ అని అన్నారు.

Exit mobile version