NTV Telugu Site icon

Wriddhiman Saha Retirement: క్రికెట్‭కు గుడ్ బై చెప్పిన టీమిండియా వికెట్ కీపర్

Wriddhiman Saha Retirement

Wriddhiman Saha Retirement

Wriddhiman Saha Retirement: టీమిండియా న్యూజిలాండ్‌తో మూడు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌ను టీమిండియా 0-3తో ఓటమి చవిచూడాల్సి వచ్చింది. సొంతగడ్డపై మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో టీమిండియా వైట్‌వాష్ కావడం భారత క్రికెట్ చరిత్రలో ఇదే తొలిసారి. ఈ ఘోరమైన ఓటమి తర్వాత, అకస్మాత్తుగా టీమిండియా వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ రిటైర్మెంట్ ప్రకటించాడు. బెంగాల్ తరఫున రంజీ ట్రోఫీ ఆడుతున్న భారత స్టార్ వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ వృద్ధిమాన్ సాహా సోషల్ మీడియా ద్వారా రిటైర్మెంట్ ప్రకటించాడు. ఈసారి తన కెరీర్‌లో చివరి రంజీ సీజన్‌ ఆడనున్నట్టు సాహా తెలిపాడు. అతను 2021లో టీమ్ ఇండియా తరఫున తన చివరి మ్యాచ్ ఆడాడు.

Read Also: Bus Fire Accident: బస్సులో ఒక్కసారిగా మంటలు.. ఆహాకారాలు పెట్టిన ప్రయాణికులు

మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ రిటైర్మెంట్ తర్వాత, సాహా కొంతకాలం భారత టెస్టు జట్టుకు శాశ్వత వికెట్ కీపర్‌గా కనిపించాడు. అయితే, 2021లో భారత జట్టు మేనేజ్మెంట్ సాహాను జట్టు నుండి తొలగించాలని నిర్ణయించింది. రిషబ్ పంత్‌కు బ్యాకప్‌గా KS భరత్ ఎంపికయ్యాడు. అయితే, ప్రస్తుతం ధృవ్ జురెల్ టెస్ట్ టీమ్ ఇండియాలో పంత్‌కు బ్యాకప్‌గా కనిపిస్తున్నాడు. సోషల్ మీడియాలో షేర్ చేసిన ఒక పోస్ట్‌లో, “క్రికెట్‌లో చిరస్మరణీయమైన ప్రయాణం తర్వాత, ఈ సీజన్ నా చివరిది. రిటైర్మెంట్‌కు ముందు రంజీ ట్రోఫీలో మాత్రమే ఆడడం నాకు గౌరవంగా ఉంది. ఈ సీజన్‌ను గుర్తుండిపోయేలా చేయండి.” అంటూ రాసుకొచ్చాడు వృద్ధిమాన్ సాహా.

వృద్ధిమాన్ సాహా తన కెరీర్‌లో టీమిండియా తరఫున 40 టెస్టులు, 9 వన్డేలు ఆడాడు. టెస్టులో 56 ఇన్నింగ్స్‌లలో, అతను 29.41 సగటుతో 1353 పరుగులు చేశాడు. ఇందులో 3 సెంచరీలు, 6 అర్ధ సెంచరీలు ఉన్నాయి. అలాగే సాహా 5 వన్డేల్లో 41 పరుగులు చేశాడు.

Show comments