Wrestlers Protests: భారత రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ పై చర్యలు తీసుకోవాలంటూ రెజ్లర్లు గత నెలరోజులుగా నిరసన చేస్తున్నారు. వారి నిరసనల పట్ల దేశ వ్యాప్తంగా పలువురు నేతలు, పార్టీలు మద్దతు పలుకుతున్నాయి. ఈ నేపథ్యంలోనే కేంద్ర కీడా శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ రెజ్లర్లతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో సాక్షి మాలిక్, భజరంగ్ పునియా సహా పలువురు రెజ్లర్లు, రైతు సంఘాల నేత రాకేష్ టికాయత్ పాల్గొ్న్నారు.
Read Also: Deve Gowda: దేశంలో బీజేపీ సంబంధం లేని పార్టీని చూపించండి.. మాజీ ప్రధాని సంచలన కామెంట్స్..
అయితే ఈ సమావేశంలో పలు కీలకమైన విషయాలపై చర్చించారు. మహిళ నేతృత్వంలో రెజ్లింగ్ ఫెడరేషన్‌లో అంతర్గత ఫిర్యాదు కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. రెజ్లర్లపై నమోదైన అన్ని ఎఫ్ఐఆర్‌లను వెనక్కి తీసుకోవాలని, బ్రిజ్ భూషణ్ సింగ్ మూడుసార్లు డబ్ల్యూఎఫ్ఐ చీఫ్ పదవి చేపట్టినందున మరోసారి ఆయనను ఎన్నుకోరాదని రెజ్లర్లు పట్టుబట్టారు. డబ్ల్యూఎఫ్ఐ ఎన్నికలను ఈనెల 30లోగా నిర్వహిస్తామని మంత్రి అనురాగ్ ఠాకూర్ వెల్లడించారు. జూన్ 15లోగా రెజ్లర్లు ఎలాంటి నిరసనలు చేపట్టరాదని రెజ్లర్లతో భేటీ అనంతరం కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ తెలిపారు.
Read Also: President Tour: మరోసారి తెలంగాణకు రాష్ట్రపతి.. ఆ తేదీల్లో హైదరాబాద్ కు రాక
మరోవైపు రెజ్లర్లతో తాను ఆరు గంటల పాటు సంప్రదింపులు జరిపినట్లు మంత్రి అనురాగ్ వెల్లడించారు. ఈ నెల 15లోగా విచారణ ముగుస్తుందని ఈ సందర్భంగా తాను వారికి హామీ ఇచ్చానని తెలిపారు. విచారణ అనంతరం చార్జిషీట్లు దాఖలు చేస్తారని చెప్పారు. ఇక లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న బ్రిజ్ భూషణ్ సింగ్‌ను అరెస్ట్ చేయాలని రెజ్లర్లు డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. ఇదే విషయంపై రెజ్లర్లు కేంద్ర మంత్రి ముందు పట్టుపట్టినట్టు సమాచారం.
