Site icon NTV Telugu

WPL 2023: నేడు యూపీ వారియర్స్ vs రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు.. గెలుపెవరిది

Rcb Vs Up

Rcb Vs Up

ప్రస్తుతం జరుగుతున్న ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (WPL)లో కీలకమైన 13వ మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఉమెన్ (RCB-W) మార్చి 15 (బుధవారం) నవీ ముంబైలోని డాక్టర్ DY పాటిల్ స్పోర్ట్స్ అకాడమీలో UP వారియర్జ్ ఉమెన్ (UPW-W)తో తలపడనుంది. రాయల్ ఛాలెంజర్స్ భవితవ్యాన్ని నిర్ణయించడంలో రాబోయే మ్యాచ్ కీలకం. ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (WPL 2023) ప్రారంభ సీజన్‌లో ఇప్పటివరకు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB-W)కి ఆశించిన స్థాయిలో ఆడలేదు. బ్యాటింగ్ మరియు బౌలింగ్ విభాగాలు రెండింటిలోనూ వారిని కష్టాలు వెంటాడుతున్నాయి. వారు ఇప్పటివరకు ఈ సీజన్‌లో ఆడిన ఐదు మ్యాచ్‌లలో ఓడిపోయారు. మరోవైపు యూపీ వారియర్స్‌ తమ ప్రత్యర్థి జట్టు ఆర్సీబీ జట్టుతో పోలిస్తే మెరుగైన సీజన్‌ను కలిగి ఉంది. ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లో ఢిల్లీ క్యాపిటల్స్‌, ముంబై ఇండియన్స్‌ చేతిలో రెండింట్లో విజయం సాధించగా, రెండింట్లో ఓడిపోయింది.

Also Read : NTR 30: తారక్ తిరిగొచ్చాడు… ఇక మొదలెడదామా?

అయితే నేడు.. మహిళల ప్రీమియర్ లీగ్ క్రికెట్ పోటీల్లో భాగంగా ఈరోజు రాత్రి 7.30గంటలకు ముంబైలోని డాక్టర్ డీవై పాటిల్ స్పోర్ట్స్ అకాడమీలో జరిగే మ్యాచ్ లో యూపీ వారియర్స్ జట్టు- రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుతో తలపడుతుంది. రీసెంట్‌గా ఢిల్లీ క్యాపిటల్స్‌తో ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లోనూ ఆర్సీబీ ఆరు వికెట్ల తేడాతో ఓటమి చెందింది. చివరి ఓవర్‌లో 9 పరుగులు సాధించలేక ఓటమి ముందు తల వంచింది ఆర్సీబీ. అలా వరుస ఐదు ఓటములతో పాయింట్ల పట్టికలో చిట్ట చివరి స్థానంలో ఉండిపోయిది.

Also Read : Google Map: విద్యార్థి కొంప ముంచిన గూగుల్‌ మ్యాప్‌..! ఎంత పనిచేసింది..

Exit mobile version