BCCI announces WPL Auction 2024 Date and Location: మహిళల ప్రిమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) 2024 వేలానికి రంగం సిద్ధమైంది. డిసెంబర్ 9న ముంబై వేదికగా డబ్ల్యూపీఎల్ రెండో సీజన్ మినీ వేలం జరగనున్నట్లు శుక్రవారం బీసీసీఐ అధికారికంగా ప్రకటించింది. వచ్చే ఏడాది ఫిబ్రవరి-మార్చిలో డబ్ల్యూపీఎల్ సీజన్-2 ఆరంభం కానుంది. ఈ ఏడాది జరిగిన తొలి సీజన్‌కు విశేష స్పందన వచ్చిన విషయం తెలిసిందే. పురుషుల ఐపీఎల్‌కు దీటుగా మహిళల ఐపీఎల్‌ను కూడా నిర్వహిస్తామని బీసీసీఐ చెప్పిన సంగతి తెలిసిందే.
ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ టైటాన్స్, యూపీ వారియర్స్ జట్లు 60 మంది క్రికెటర్లను అట్టిపెట్టుకున్నాయి. వీరిలో 21 మంది విదేశీ క్రికెటర్లు ఉన్నారు. ఇక 29 మందిని ఫ్రాంఛైజీలు రిలీజ్ చేశాయి. వీరు ఫిబ్రవరి-మార్చిలో జరగనున్న వేలంలోకి రానున్నారు. గుజరాత్ టీమ్ అత్యధికంగా 11 మందిని వేలానికి వదిలేసింది.
Also Read: Smallest Polling Booth: రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికలు.. ఒక్క కుటుంబం కోసం పోలింగ్ బూత్!
5 ఫ్రాంఛైజీలు వదులుకున్న క్రికెటర్లలో తెలుగమ్మాయి సబ్బినేని మేఘన (గుజరాత్ టైటాన్స్) కూడా ఉంది. అంజలి శర్వాణి (యూపీ వారియర్స్), అరుంధతి రెడ్డి (ఢిల్లీ క్యాపిటల్స్) వచ్చే సీజన్లో సొంత జట్లకే ఆడనున్నారు. హీథర్ గ్రాహం, నీలం బిష్త్, డేన్ వాన్ నీకెర్క్, ఎరిన్ బర్న్స్, మేగాన్ షుట్, అన్నాబెల్ సదర్లాండ్, సబ్బినేని మేఘన, సోఫియా డంక్లీ, సుష్మా వర్మ లాంటి స్టార్ ప్లేయర్స్ రిలీజ్ జాబితాలో ఉన్నారు. ఇక ఈ ఏడాది జరిగిన తొలి డబ్ల్యూపీఎల్ టోర్నీలో ముంబై ఇండియన్స్ విజేతగా నిలిచింది.