NTV Telugu Site icon

WPL 2025: ఆర్సీబీకి షాక్.. టోర్నమెంట్ నుంచి ఔట్

Rcb

Rcb

డిఫెండింగ్ ఛాంపియన్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB)కి షాక్ తగిలింది. ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ 2025( WPL)లో టోర్నమెంట్ నుంచి నిష్క్రమించింది. శనివారం యూపీ వారియర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆర్సీబీ 12 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఈ క్రమంలో టోర్నీ నుంచి ఔట్ అయింది. కాగా ఈ సీజన్‌లో ప్లేఆఫ్స్‌కు చేరుకున్న మూడు జట్లను ప్రకటించారు. అయితే, పాయింట్ల పట్టికలో ఏ జట్టు మొదటి స్థానంలో నిలిచి నేరుగా ఫైనల్ ఆడుతుందో ఇంకా ప్రకటించలేదు. ప్రస్తుతానికి ఢిల్లీ క్యాపిటల్స్, గుజరాత్ జెయింట్స్, ముంబై ఇండియన్స్ ప్లేఆఫ్స్‌కు చేరుకున్నాయి. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, యుపీ వారియర్స్ జట్టు టోర్నమెంట్ ప్లేఆఫ్స్ రేసు నుండి నిష్క్రమించాయి.

READ ALSO: Prabhas : ‘ది రాజా సాబ్’ రిలీజ్ లేట్‌కి అదే కారణమా..?

పాయింట్ల పట్టికలో ఢిల్లీ క్యాపిటల్స్ 7 మ్యాచ్‌లలో 5 గెలిచి టాప్ ప్లేస్‌లో ఉంది. జట్టు ఖాతాలో 10 పాయింట్లు, +0.396 నికర రన్ రేట్ ఉంది. గుజరాత్ జెయింట్స్ 7 మ్యాచ్‌ల్లో 4 గెలిచి రెండవ స్థానంలో ఉంది. ఆ జట్టు ఖాతాలో 8 పాయింట్లు.. నికర రన్ రేట్ +0.334 ఉంది. ముంబై ఇండియన్స్ 6 మ్యాచ్‌ల్లో 4 గెలిచింది. +0.267 నికర రన్ రేట్‌తో మూడవ స్థానంలో ఉంది. కాగా.. నంబర్ వన్ జట్టు నేరుగా ఫైనల్ ఆడుతుంది. రెండు, మూడవ స్థానంలో ఉన్న జట్లు ఎలిమినేటర్ మ్యాచ్‌లో తలపడతాయి.

READ ALSO: Virat Kohli: అరుదైన రికార్డుకు దగ్గరలో కోహ్లీ.. మాజీ దిగ్గజ ఆటగాళ్లను వెనక్కి నెట్టి..!

పాయింట్ల పట్టికలో నాల్గవ స్థానంలో యుపీ వారియర్స్ ఉంది. 8 మ్యాచ్‌లు ఆడి 3 మ్యాచ్‌లలో మాత్రమే గెలిచింది. ఆ జట్టు ఖాతాలో 6 పాయింట్లు ఉన్నాయి.. నికర రన్ రేట్ -0.624 ఉంది. ఈ టోర్నమెంట్‌లో మంచి ఆరంభం చేసిన డిఫెండింగ్ ఛాంపియన్‌.. ఆ తర్వాత వరుసగా ఐదు మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. దీంతో.. టోర్నమెంట్‌లో జట్టు ప్రయాణం ముగిసింది. ఏడు మ్యాచ్‌ల్లో కేవలం 2 మాత్రమే గెలిచింది.