WPL 2027: సంచలన నిర్ణయం తీసుకున్న ఆర్సీబీ.. విధ్వంసకర బ్యాట్స్‌మెన్ రిలీజ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మహిళా ప్రీమియం లీగ్ 2027 సీజన్‌కు సంబంధించి డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు కీలక నిర్ణయాలు తీసుకుంది. అక్టోబర్ 28న కొచ్చి వేదికగా జరిగే మినీ వేలానికి ముందు ఆస్ట్రేలియా విధ్వంసకర బ్యాటర్ గ్రేస్ హరిస్తో పాటు డి.హేమలత, గౌతమి నాయక్, లించి స్మిత్‌లను ఆర్సీబీ ఫ్రాంచైజీ రిలీజ్ చేసింది.
ఈ పరిణామంతో కెప్టెన్ స్మృతి మంధాన నేతృత్వంలోని జట్టులో ప్రస్తుతం మొత్తం పదమూడు మంది ఆటగాళ్లు మాత్రమే మిగిలారు. నిబంధనల ప్రకారం ఒక జట్టు గరిష్టంగా పద్దెనిమిది మంది ఆటగాళ్లను కలిగి ఉండవచ్చు. దీంతో ఆర్సీబీ వేలంలో మరో ఐదు స్థానాలను భర్తీ చేసుకునే అవకాశం ఉంది. గ్రేస్ హరిస్‌ను మళ్లీ వేలంలో కొనుగోలు చేస్తారా అనేది ఆసక్తికరంగా మారింది.
Also Read
- OTR: చంద్రబాబుకు జనసేన ఫిర్యాదు.. బాపట్ల ఎమ్మెల్యే నరేంద్ర వర్మ కు అగ్నిపరీక్ష!
- CS Karnan Dies: సీజేఐ సహా సుప్రీంకోర్టు జడ్జీల అరెస్టుకే ఆదేశాలు.. వివాదాస్పద మాజీ హైకోర్టు న్యాయమూర్తి కర్ణన్ కన్నుమూత!
- Achanta: సర్పంచ్ స్థానాన్ని ఏకగ్రీవం చేస్తే రూ. 2 కోట్లు ఇస్తా.. జనసేన నేత సంచలన ప్రతిపాదన..
- AP Govt: ఏపీకి పెట్టుబడుల వెల్లువ.. రూ.32.49 లక్షల కోట్ల మైలురాయి..
ఆర్సీబీ రిటైన్ చేసుకున్న ఆటగాళ్ల జాబితాలో స్మృతి మంధాన, ఎలిస్ పెర్రి, రిచా ఘోష్, రాధా యాదవ్, శ్రేయాంక పాటిల్, పూజా వస్త్రాకర్, అరుంధతి రెడ్డి, జార్జియా వోల్, లారెన్ బెల్, నెడిన్ డి క్లర్క్, ప్రత్యుష కుమార్, రావత్, సయాలి సత్ఘరే ఉన్నారు. గడువు ముగిసే సమయానికి ఐదు ఫ్రాంచైజీలు కలిసి ఇరవై మూడు మంది విదేశీ ఆటగాళ్లతో సహా మొత్తం అరవై మూడు మందిని అట్టిపెట్టుకున్నాయి. గత సీజన్లో అందుబాటులో లేని ఆస్ట్రేలియా స్టార్ ఆల్ రౌండర్ ఎలిస్ పెర్రీ రాబోయే టోర్నీకి పూర్తిగా అందుబాటులో ఉండటం ఆర్సీబీకి మరింత బలాన్ని చేకూరుస్తోంది.
నూతన సీజన్ మ్యాచ్‌లు వచ్చే ఏడాది జనవరి 14 నుంచి ప్రారంభం కానున్నాయి. మిగతా జట్లు కూడా ప్రక్షాళన చేపట్టాయి. ఢిల్లీ క్యాపిటల్స్ అలేనా కింగ్, స్నేహ రాణా, లిజెల్ లీ సహా ఆరుగురిని వదులుకోగా, ముంబై ఇండియన్స్ సైకా ఇషాక్ వంటి వారిని రిలీజ్ చేసింది. గుజరాత్ జెయింట్స్ కూడా డానియల్ వాట్ హాజ్ను విడిచిపెట్టింది. ఖాళీగా ఉన్న మిగిలిన స్థానాలను భర్తీ చేయడానికి అన్ని జట్లు వ్యూహాలు రచిస్తున్నాయి. బలమైన కోర్ గ్రూప్‌తో కూడిన ఆర్సీబీ జట్టు ఈసారి కూడా వేలంలో ఆచితూచి వ్యవహరించి మరోసారి టైటిల్ పోరులో నిలవాలని గట్టి పట్టుదలతో ఉంది.
- Tags
- WomenCricket
తాజావార్తలు
-
OTR: లెక్కలు మారుతున్నాయా? కంగారులో కూటమి.. వైసీపీ మాత్రం పక్కా లెక్కలతో ముందడుగు వేస్తుందా?
-
OTR: చంద్రబాబుకు జనసేన ఫిర్యాదు.. బాపట్ల ఎమ్మెల్యే నరేంద్ర వర్మ కు అగ్నిపరీక్ష!
-
Pooja Hegde: ఫ్లాపులు వెంటాడుతున్నా తగ్గని బుట్టబొమ్మ క్రేజ్.. బన్నీ సినిమాతో జాక్‌పాట్ తగిలినట్టేనా?
-
CS Karnan Dies: సీజేఐ సహా సుప్రీంకోర్టు జడ్జీల అరెస్టుకే ఆదేశాలు.. వివాదాస్పద మాజీ హైకోర్టు న్యాయమూర్తి కర్ణన్ కన్నుమూత!
-
Achanta: సర్పంచ్ స్థానాన్ని ఏకగ్రీవం చేస్తే రూ. 2 కోట్లు ఇస్తా.. జనసేన నేత సంచలన ప్రతిపాదన..
ట్రెండింగ్
-
Red Line on Medicine Strips: మెడిసిన్ స్ట్రిప్‌పై ఎర్రగీత ఉందా? ఈ విషయం తప్పక తెలుసుకోండి..!
-
IND vs NZ 4th ODI: అదే మా కొంపముంచింది.. ఓటమిని జీర్ణించుకోవడం కష్టం.. శ్రేయస్ భావోద్వేగ వ్యాఖ్యలు!
-
Matt Henry: భారత్‌ను మడతెట్టెస్తున్న మాట్ హెన్రీ.. ఇది మూడోసారి.. ఏకంగా 8 వికెట్స్!
-
NZ vs IND 4th ODI: భారత్ ఖాతాలో చెత్త రికార్డు.. పాకిస్థాన్ సరసన టీమిండియా!
-
India Playing XI 4th ODI: గిల్, రాహుల్, కాంబోజ్ అవుట్.. ఇషాన్ కిషన్, సిరాజ్ ఇన్.. కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్..!