Site icon NTV Telugu

Meg Lanning: 2026 WPL లో UP వారియర్స్‌కు కొత్త కెప్టెన్.. ఎవరో తెలుసా!

Meg Lanning

Meg Lanning

Meg Lanning: ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ కొత్త సీజన్‌ స్టార్టింగ్‌కు కొద్ది రోజులే మిగిలి ఉంది. ఈ కొత్త సీజన్ కోసం ఇప్పటికే జట్లు తమ కెప్టెన్లను మార్చుకోవడం ప్రారంభించాయి. WPL 2026 కొత్త సీజన్‌కు ఉత్తర ప్రదేశ్ వారియర్స్ కెప్టెన్ గా విదేశీ స్టార్ క్రికెటర్ నియమితులయ్యారు. ఇంతకీ ఆమె ఎవరో తెలుసా… ఆస్ట్రేలియా మహిళా క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మెగ్ లానింగ్. జనవరి 9న ప్రారంభం కానున్న WPL‌లో యూపీ వారియర్స్ జట్టుకు మెగ్ లానింగ్ నాయకత్వం వహించనుంది. ఈ స్టార్ ప్లేయర్ గతంలో ఢిల్లీ క్యాపిటల్స్‌కు కెప్టెన్‌గా వ్యవహరించారు. ఆ టైంలో ఆమె ఢిల్లీ జట్టును మూడుసార్లు ఫైనల్స్‌కు వరకు తీసుకెళ్లింది.

READ ALSO: CM Chandrababu: కృష్ణా జలాలపై స్పందించిన సీఎం చంద్రబాబు..

తాజాగా UP వారియర్స్ ఫ్రాంచైజ్ 2026 WPL సీజన్‌కు ముందు లానింగ్‌ను కెప్టెన్‌గా నియమించినట్లు ప్రకటించింది. UP వారియర్స్ ఈ ప్లేయర్‌ను వేలంలో రూ.1.9 కోట్లకు కొనుగోలు చేసింది. ఆస్ట్రేలియా తరపున ఏడుసార్లు ప్రపంచ కప్‌ గెలిచిన జట్టులో మెగ్ లానింగ్ ఒకరు. వీటిల్లో రెండు వన్డేలు, ఐదు టీ20 టైటిళ్లు ఉన్నాయి. ఈ సందర్భంగా యూపీ వారియర్స్ జట్టు కొత్త చీఫ్ కోచ్ అభిషేక్ నాయర్ మాట్లాడుతూ.. మెగ్ అనుభవం తనను ఇతర కెప్టెన్ల నుంచి భిన్నంగా ఉంచుతుందని అన్నారు. ఈ సంవత్సరం WPL రెండు భాగాలుగా జరుగనుంది. మొదటి దశ జనవరి 9 నుంచి 17 వరకు నవీ ముంబైలో, రెండవ దశ జనవరి 19 నుంచి ఫిబ్రవరి 5 వరకు వడోదరలో జరుగుతుంది. మెగ్ లానింగ్ క్రికెట్ కెరీర్ విషయానికి వస్తే ఆమె 27 WPL మ్యాచ్‌ల్లో 952 పరుగులు చేసింది.

READ ALSO: Nigeria: రక్తసిక్తమైన నైజీరియా.. 30 మందిపైగా మృతి

Exit mobile version