Site icon NTV Telugu

WPL 2026 Unsold Players: అయ్యబాబోయ్.. అన్‌సోల్డ్ లిస్ట్ పెద్దదే సుమీ..!

Wpl 2026

Wpl 2026

WPL 2026 Unsold Players: WPL 2026 మెగా వేలం నేడు న్యూఢిల్లీలో హోరాహోరీగా సాగింది. ఈ వేలంలో కీలక ఆటగాళ్లను దక్కించుకోవడానికి జట్లు పోటీపడ్డాయి. ఇది ఇలా ఉంటే.. మరోవైపు అన్‌సోల్డ్ ఆటగాళ్ళ లిస్ట్ కూడా పెద్దగానే ఉంది. మహిళల ప్రీమియర్ లీగ్ (WPL) 2026 వేలం ప్రక్రియలో జట్ల వ్యూహాలు, వాటి వద్ద మిగిలి ఉన్న నగదు వివరాలు ఆసక్తికరంగా ఉన్నాయి. నేటి వేలం తర్వాత ప్రస్తుతం గుజరాత్ జెయింట్స్ వద్ద అత్యధికంగా రూ. 5.4 కోట్లు ఉండటమే కాకుండా.. ఆ జట్టులో 12 స్లాట్లు ఖాళీగా ఉన్నాయి. ఆ తర్వాత యూపీ వారియర్స్ రూ. 4.65 కోట్లతో 9 ఖాళీలను భర్తీ చేయాల్సి ఉంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) చేతిలో రూ. 2.85 కోట్లు ఉండగా 8 స్లాట్లు ఖాళీగా ఉన్నాయి. ముంబై ఇండియన్స్ వద్ద రూ. 1.95 కోట్లు ఉన్నప్పటికీ ఇంకా 10 మంది క్రీడాకారిణులను తీసుకోవాల్సి ఉంది. ఇక ఢిల్లీ క్యాపిటల్స్ వద్ద అందరికంటే తక్కువగా రూ. 1.1 కోట్లు మాత్రమే మిగిలి ఉండగా.. ఆ జట్టులో 7 స్లాట్లు ఖాళీగా ఉన్నాయి.

Drishyam 3 Rights: కళ్లు చెదిరే ఆఫర్.. పనోరమా స్టూడియోస్‌‌కు ‘దృశ్యం3’ థియేట్రికల్‌ రైట్స్‌

ఈ వేలంలో కొంతమంది ప్లేయర్లకు జాక్‌పాట్ తగలగా, మరికొందరికి మాత్రం నిరాశే ఎదురైంది. ముఖ్యంగా తెలుగమ్మాయి జి. త్రిష ఈ వేలంలో అమ్ముడుపోకుండా అన్‌సోల్డ్‌గా మిగిలిపోవడం నిరాశ కలిగించింది. అలాగే అన్‌క్యాప్‌డ్ బ్యాటర్ల విభాగంలో ప్రణవి చంద్ర, వింద్రా దినేశ్, దిశా కసత్, అరుషి గోయెల్ (వీరందరి కనీస ధర రూ. 10 లక్షలు), డెవినా ఫెరిన్ (కనీస ధర రూ. 20 లక్షలు)లను కొనుగోలు చేయడానికి ఏ ఫ్రాంచైజీ ఆసక్తి చూపలేదు.

Tirumala Laddu Ghee Adulteration Case: తిరుమల కల్తీ నెయ్యి లడ్డు కేసులో మరో అరెస్టు !

బౌలింగ్ విభాగంలోనూ యువ క్రీడాకారిణులకు చేదు అనుభవం ఎదురైంది. హ్యాపీ కుమారి, నందని శర్మ, కోమల్‌ప్రీత్ కౌర్, షబ్నమ్ షకిల్, ప్రకాశిక నాయక్ వంటి అన్‌క్యాప్‌డ్ బౌలర్లు ఎవరూ కూడా బిడ్‌ను దక్కించుకోలేక అన్‌సోల్డ్ జాబితాలో చేరిపోయారు. ఫ్రాంచైజీలు అనుభవం ఉన్న ప్లేయర్ల వైపే మొగ్గు చూపడంతో ఈ యువ టాలెంట్‌కు ఈసారి అవకాశం దక్కలేదు.

Exit mobile version