MIW vs RCBW: వడోదర వేదికగా జరిగిన ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (WPL) 2026 కీలక మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ ఉమెన్స్ జట్టు ఘన విజయం సాధించింది. టేబుల్ టాపర్స్ గా కొనసాగుతున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఉమెన్స్ పై 15 పరుగుల తేడాతో గెలిచి ప్లేఆఫ్స్ ఆశలను సజీవంగా ఉంచుకుంది. ఈ మ్యాచ్‌లో నాట్ స్కివర్ బ్రంట్ అద్భుత శతకంతో WPL చరిత్రలోనే మొదటి సెంచరీ చేసిన ఆటగాడిగా రికార్డ్ సృష్టించింది.
మారుతి సంచలనం.. బూట్ స్పేస్ సమస్యకు చెక్.. Maruti Brezza CNG వచ్చేస్తోంది!
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. ముందుగా బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 199 పరుగులు చేసింది. ఈ ఇన్నింగ్స్ లో నాట్ స్కివర్ బ్రంట్ కేవలం 57 బంతుల్లో 16 ఫోర్లు, ఒక సిక్స్‌తో అజేయంగా 100 పరుగులు చేసింది. ఆమెకు హేలీ మాథ్యూస్ చక్కటి సహకారం అందించింది. మాథ్యూస్ కూడా 39 బంతుల్లో 56 పరుగులు చేసి రెండో వికెట్‌కు వీరిద్దరూ కలిసి 131 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. చివర్లో కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ కూడా వేగంగా 20 పరుగులు చేసింది.
ఇక 200 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన RCB ఉమెన్స్ కు ఆరంభంలోనే భారీ షాక్ తగిలింది. పవర్‌ప్లేలోనే 35 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి ఒక్కసారిగా తీవ్ర ఒత్తిడిలో పడింది. ఆ తర్వాత జట్టు వికెట్ కీపర్ బ్యాటర్ రిచా ఘోష్ జట్టు భారాన్ని ఒంటి చేత్తో మోసింది. ఆమె 50 బంతుల్లో 10 ఫోర్లు, 6 సిక్సులతో 90 పరుగులు చేయడంతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు విజయం దగ్గరికి వచ్చింది. చివరి వరకు మ్యాచ్‌లో ఉత్కంఠను నిలిపింది. ఇక రిచా ఘోష్ కు నడిన్ డి క్లర్క్ 28 పరుగులు చేసి కొంత వరకు మద్దతు ఇచ్చినా, లక్ష్యాన్ని అందుకోలేక చివరకు 20 ఓవర్లలో 9 వికెట్లకు 184 పరుగులకే పరిమితమైంది.
100x జూమ్ నుంచి 6200mAh బ్యాటరీ వరకు.. స్మార్ట్ ధరలో ఫ్లాగ్‌షిప్ అనుభవం.. నేడే vivo X200T లాంచ్..!
బౌలింగ్‌లో ముంబై తరఫున హేలీ మాథ్యూస్ 3 వికెట్లు కీలక పాత్ర పోషించింది. ఆమె స్మృతి మంధానా, జార్జియా వోల్, రాధా యాదవ్ వికెట్లను పడగొట్టింది. షబ్నీమ్ ఇస్మాయిల్ 2 వికెట్లు తీయగా, అమేలియా కేర్ కూడా 2 వికెట్లతో రాణించింది. ఈ విజయంతో ముంబై ఇండియన్స్ 7 మ్యాచ్‌లలో 6 పాయింట్లతో పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి చేరుకుంది. డిఫెండింగ్ చాంపియన్స్‌గా మరోసారి ప్లేఆఫ్స్ దిశగా దూసుకెళ్తుంది. నాట్ స్కివర్-బ్రంట్ శతకం ఈ సీజన్ కే కాదు.. మొత్తం WPL చరిత్రలోనే మొదటి సెంచరీ.
