Site icon NTV Telugu

WPL 2026 Full Team List: ముగిసిన మెగా WPL వేలం.. అన్ని జట్టులోని ఆటగాళ్ల ఫుల్ లిస్ట్ ఇదే..

Wpl 2026 Full Team

Wpl 2026 Full Team

WPL 2026 Full Team List: న్యూఢిల్లీ వేదికగా జరిగిన మహిళల ప్రీమియర్ లీగ్ (WPL) నాలుగో సీజన్ మెగా వేలం ముగిసింది. ఐదు ఫ్రాంచైజీలు కొత్త ఆటగాళ్లతో తమ స్క్వాడ్‌లను నింపేశారు. ఇక 2026లో జరగబోయే WPL కప్ గెలవడమే లక్ష్యంగా బరిలోకి దిగడమే. పరిమిత సంఖ్యలో ఆటగాళ్లను మాత్రమే రిటైన్ చేయడానికి అనుమతి ఇవ్వడంతో జట్లు కొత్త ఎంపికలతో భారీగా ఖర్చు చేశాయి. నేడు జరిగిన ఈ వేలంలో అత్యంత ఖరీదైన ప్లేయర్‌గా దీప్తి శర్మ నిలిచింది. ఆమె కోసం యూపీ వారియర్స్ ఏకంగా రూ. 3.2 కోట్ల భారీ ధర చెల్లించగా.. ముంబై ఇండియన్స్ న్యూజిలాండ్ స్టార్ అమేలియా కెర్‌ను రూ. 3 కోట్లకు కొనుగోలు చేసింది. ఇక WPL 2026 సీజన్‌ కోసం ఐదు జట్లు ఎలా ఉన్నాయంటే..

ఢిల్లీ క్యాపిటల్స్ (Delhi Capitals):
షఫాలి వర్మ, అనబెల్ సదర్లాండ్, జెమిమా రోడ్రిగ్స్, మరిజాన్ కాప్, శ్రీ చరణి, షినెల్ హెన్రీ, లారా వోల్వార్ట్, నికి ప్రసాద్, స్నేహ్ రాణా, తానియా భాటియా, లిజెల్ లీ, దీయా యాదవ్, మమత మడివాల, నందని శర్మ, లూసీ హామిల్టన్, మిన్ను మణి.

PM Modi: టీ20 వరల్డ్‌కప్‌ గెలిచిన మహిళా అంధుల క్రికెట్‌ జట్టును కలిసిన ప్రధాని మోడీ..

గుజరాత్ జెయింట్స్ (Gujarat Giants):
ఆష్లే గార్డ్నర్, బెత్ మూనీ, సోఫీ డివైన్, జార్జియా వార్హామ్, భారతి ఫుల్మాలి, కశ్వీ గౌతమ్, రేణుకా సింగ్, యస్తికా భాటియా, అనుష్క శర్మ, తనుజా కన్వర్, కనికా అహుజా, తితాస్ సాదు, హ్యాపీ కుమారి, కిమ్ గార్త్, శివాని సింగ్, డానియెల్ వైట్-హాడ్జ్, రాజేశ్వరి గాయకవాడ్, అయుషి సోని.

ముంబై ఇండియన్స్ (Mumbai Indians):
నాట్ స్కైవర్-బ్రంట్, అమేలియా కెర్, హర్మన్‌ప్రీత్ కౌర్, హేలీ మాథ్యూస్, అమంజోత్ కౌర్, సజీవన్ సజనా, షాబ్నిమ్ ఇస్మాయిల్, గునాలన్ కుల్కర్ణి, నికోలా కేరీ, సన్స్కృతి గుప్తా, రాహిల్ ఫిర్దౌస్, పూనమ్ కేస్‌నర్, త్రివేణి వసిష్ఠ, నల్లా రెడ్డి, సైకా ఇషాక్, మిల్లీ ఇల్లింగ్వర్త్.

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (Royal Challengers Bengaluru):
స్మృతి మంధాన, రిచా ఘోష్, ఎలిస్ పెర్రీ, లారెన్ బెల్, పూజా వస్ట్రాకర్, అరుంధతి రెడ్డి, రాధా యాదవ్, నాడిన్ డే క్లర్క్, శ్రేయంకా పటేల్, జార్జియా వోల్, లిన్సే స్మిత్, ప్రేమ రవత్, గౌతమీ నాయక్, ప్రత్యూష కుమార్, దయాలన్ హేమలత.

Digital Arrest in Kadapa: టీచర్‌ డిజిటల్‌ అరెస్ట్.. సీబీఐ పేరుతో రూ.1.60 కోట్లు లూటీ..

యూపీ వారియర్స్ (UP Warriorz):
దీప్తి శర్మ, శిఖా పాండే, మేగ్ లానింగ్, ఫోబ్ లిచ్‌ఫీల్డ్, ఆశా సోభనా, సోఫీ ఎకిల్‌స్టోన్, డియాండ్రా డాటిన్, కిరణ్ నవ్‌గిరే, క్రాంతి గౌడ్, శ్వేత సీహరవత్, హర్లీన్ దియోల్, క్లోయ్ ట్రయాన్, సుమన్ మీనా, సిమ్రన్ షేక్, జీ త్రిషా, ప్రతీక రవాల్.

Exit mobile version