WPL 2026 Final: ఈసారైనా ‘ఢిల్లీ’ కోరిక తీరేనా? కొత్త కెప్టెన్ జట్టు తలరాత మారుస్తుందా!

Wpl 2026

Wpl 2026

WPL 2026 Final: మహిళల ప్రీమియర్ లీగ్ (WPL) 2026 తుది దశకు చేరుకుంది. WPL ఫైనల్‌ 2026లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB), ఢిల్లీ క్యాపిటల్స్ (DC) జట్లు మరికొద్ది సేపట్లో వడోదరలోని కొటాంబి అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో తలపడనున్నాయి. 2024లో ఛాంపియన్‌గా నిలిచిన ఆర్సీబీ జట్టు మరోసారి టైటిల్‌ను దక్కించుకోవాలని చూస్తుండగా, మరోవైపు ఢిల్లీ క్యాపిటల్స్ మొదటిసారి WPL ట్రోఫీని ముద్దడాలని పట్టుదలతో ఉంది.

T20 World Cup Controversy: “థాంక్యూ పాకిస్థాన్”.. పాక్ నిర్ణయంపై బంగ్లాదేశ్ రియాక్షన్..

2026 సీజన్‌ లో ఆర్సీబీ (RCB W) జట్టు అద్భుత ప్రదర్శనతో లీగ్ దశలో 8 మ్యాచ్‌ల్లో 6 విజయాలతో టాప్‌లో నిలిచింది. కెప్టెన్ స్మృతి మంధానా ముందుండి బలంగా నడిపించింది. జట్టులో బ్యాటింగ్‌ లో గ్రేస్ హారిస్, బౌలింగ్‌లో లారెన్ బెల్ బికారి ఫామ్ లో ఉన్నారు. అకాగే మరికొందరు కీలక ఆటగాళ్లు టచ్ లో ఉండడం కలిసి వచ్చే అంశం. ఈ కప్ గెలిస్తే ఇది వారి మూడో ఫ్రాంచైజీ టైటిల్ అవుతుంది.

మరోవైపు ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు ఎలిమినేటర్‌ లో గుజరాత్ జెయింట్స్‌ పై విజయం సాధించి నాలుగోసారి ఫైనల్‌ కు చేరుకుంది. కానీ ఇప్పటివరకు టైటిల్ మాత్రం దక్కలేదు. ప్రతిసారి ఆ జట్టు ఫైనల్ కు చేరుకోవడం, టైటిల్ గెలవలేకపోవడం ఆనవాయితీగా మారింది. అయితే ఈ సారి కూడా ఎప్పటిలాగే పటిష్ఠంగా ఉంది. ఈసారి జట్టు కెప్టెన్ జెమిమా రోడ్రిగ్స్ నాయకత్వంలో షఫాలి వర్మ, లిజెల్ లీ, మరిజానే కాప్ వంటి ఆటగాళ్లతో బలంగా ఉంది. మరి ఈ కొత్త కెప్టెన్ ఎంతవరకు ఢిల్లీకి అదృష్టాన్ని తీసుకవస్తుందో చూడాలి మరి.

Google Pixel 10a Launch: 48MP కెమెరా, 5100mAh బ్యాటరీ.. అతి తక్కువ ధరలో ‘పిక్సెల్‌ 10ఏ’ ఫ్లాగ్‌షిప్ ఫోన్!

డబ్ల్యూపీఎల్‌లో ఇప్పటివరకు ఈ రెండు జట్లు 9 మ్యాచ్‌లు ఆడగా.. ఢిల్లీ క్యాపిటల్స్ 6 విజయాలు, ఆర్సీబీ 3 విజయాలు సాధించాయి. జనవరి 24న జరిగిన మ్యాచ్‌ లో ఢిల్లీ క్యాపిటల్స్ 7 వికెట్ల తేడాతో గెలిచింది. అయితే 2024 ఫైనల్‌ లో ఆర్సీబీ 8 వికెట్ల తేడాతో డీసీని ఓడించి టైటిల్ గెలిచింది.

ఇరు జట్ల ప్లేయింగ్ XI: (అంచనా)

ఆర్సీబీ: స్మృతి మంధానా (కెప్టెన్), గ్రేస్ హారిస్, జార్జియా వోల్, రిచా ఘోష్, రాధా యాదవ్, నడిన్ డి క్లర్క్, పూజా వస్త్రకర్, అరుంధతి రెడ్డి, సయాలి సత్ఘరే, శ్రేయాంకా పాటిల్, లారెన్ బెల్.

డీసీ: లిజెల్ లీ, షఫాలి వర్మ, లారా వోల్వార్ట్, జెమిమా రోడ్రిగ్స్ (కెప్టెన్), మరిజానే కాప్, చినెల్లే హెన్రీ, నికీ ప్రసాద్, స్నేహ్ రాణా, మిన్ను మణి, నల్లపురెడ్డి శ్రీ చరణి, నందని శర్మ.