WPL 2025: ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ 2025 మూడవ సీజన్ నేటి (ఫిబ్రవరి 14) నుండి ప్రారంభం కానుంది. ఈ సీజన్ ప్రారంభ మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) గుజరాత్ జెయింట్స్ (GG)తో తలపడనుంది. WPL 2025 మొదటి మ్యాచ్ ఎప్పుడు, ఎక్కడ జరుగుతుందో.. అలాగే మ్యాచ్‌ను ప్రత్యక్షంగా ఎలా చూడగలరన్నా విశేషాలను చూద్దాం.
WPL 2025 1వ మ్యాచ్ శుక్రవారం 14 ఫిబ్రవరి 2025న వడోదరలోని కోటంబి స్టేడియంలో జరుగుతుంది. మ్యాచ్ రాత్రి 7.30 గంటలకు ప్రారంభమవుతుంది. Sports18 టీవీ ఛానెల్‌లలో మ్యాచ్‌ను ప్రత్యక్ష ప్రసారంలో చూడవచ్చు. అంతేకాకుండా JioCinema యాప్, వెబ్‌సైట్‌లో కూడా వీక్షించవచ్చు. ఇప్ప్పటి వరకు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ జెయింట్స్ జట్లు 4 మ్యాచ్‌ల్లో తలపడ్డాయి. ఇందులో బెంగళూరు 2 మ్యాచ్‌ల్లో, గుజరాత్ 2 మ్యాచ్‌ల్లో గెలిచాయి.
Also Read: Donlad Trump: ‘‘బంగ్లాదేశ్‌ని మోడీ వదిలేస్తున్నా’’.. ట్రంప్ సంచలన వ్యాఖ్యలు..
ఇక టీమ్స్ విషయానికి వస్తే.. బెంగళూరులో కెప్టెన్ స్మృతి మంధాన, ఆలిస్ పెర్రీ వంటి స్టార్ ప్లేయర్లు ఉన్నారు. మరోవైపు గుజరాత్ లో శుభమన్ గిల్ స్నేహితురాలు హర్లీన్ డియోల్, ఆష్లే గార్డ్నర్, డియాండ్రా డాటిన్ వంటి స్టార్ ఆటగాళ్ళు ఉండడంతో మొదటి మ్యాచ్ రసవత్తరంగా ఉండనుంది. ప్రస్తుతం స్మృతి మంధాన అద్భుతమైన ఫామ్‌లో ఉంది. గత సీజన్‌లో తన జట్టుకు టైటిల్‌ను కూడా గెలుచుకుంది. అందుకే ఈసారి వారు నమ్మకంగా ట్రోఫీలో అడుగుపెడుతున్నారు. ఇక నేడు జరగబోయే ఇరు జట్లు ప్లేయింగ్ XI ను ఈ విధంగా అంచనా వేయవచ్చు.
Also Read: Brahma Anandam Movie Review: బ్రహ్మ ఆనందం రివ్యూ
RCB ప్లేయింగ్ XI:
స్మృతి మంధాన (కెప్టెన్), డానీ వ్యాట్ హాడ్జ్, ఎస్ మేఘన, ఆలిస్ పెర్రీ, రిచా ఘోష్ (వికెట్ కీపర్), రాఘవి బిష్ట్, కనికా అహుజా, జార్జియా వారేహమ్, జాగర్వి పవార్, కిమ్ గార్త్, రేణుకా సింగ్ ఠాకూర్.
GG ప్లేయింగ్ XI:
బెత్ మూనీ (wk), లారా వూల్వార్డ్, హర్లీన్ డియోల్, డియాంద్ర డాటిన్, దయాలన్ హేమలత, ఆష్లే గార్డ్నర్ (c), సిమ్రాన్ షేక్, సయాలి, సత్ఘరే, మేఘనా సింగ్, తనుజా కన్వర్, కాశ్వి గౌతమ్, షబ్నం షకీల్/మన్నత్ కశ్యప్.