NTV Telugu Site icon

WPL 2025 Final: నేడే ఢిల్లీ క్యాపిటల్స్, ముంబై ఇండియన్స్ మధ్య ఫైనల్

Wpl 2025.

Wpl 2025.

WPL 2025 Final: WPL 2025 ఫైనల్ మ్యాచ్ నేడు (మార్చి 15)న ముంబైలోని బ్రబోర్న్ స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్స్, ముంబై ఇండియన్స్ మధ్య జరగనుంది. మెగ్ లానింగ్ కెప్టెన్సీలోని ఢిల్లీ జట్టు గ్రూప్ దశలో టేబుల్ పాయింట్స్ అగ్రస్థానంలో కొనసాగుతూ వరుసగా మూడోసారి ఫైనల్‌కు అర్హత సాధించింది. అయితే, తొలి రెండు సీజన్లలో ఢిల్లీ జట్టు ట్రోఫీ అందుకోలేకపోయింది. కానీ, ఈసారి ఛాంపియన్‌గా నిలిచేందుకు తన శాయశక్తులా ప్రయత్నించనుంది.

Read Also: Sunita Williams: నింగిలోకి దూసుకెళ్లిన స్పేస్‌ఎక్స్ ఫాల్కన్ 9 రాకెట్..

ఇక మరోవైపు, హర్మన్‌ప్రీత్ కౌర్ కెప్టెన్సీలోని ముంబై ఇండియన్స్ గ్రూప్ దశలో రెండవ స్థానంలో నిలిచింది. దీని తర్వాత, ఎలిమినేటర్ మ్యాచ్‌లో గుజరాత్ జెయింట్స్‌ను ఓడించి ఫైనల్స్‌లోకి సగర్వాంగా ప్రవేశించింది. మొదటి సీజన్‌లో ఢిల్లీని ఓడించడం ద్వారా WPL ఛాంపియన్‌గా నిలిచింది. ఇప్పుడు ముంబై జట్టు మళ్ళీ అదే ఫలితాన్ని పునరావృతం చేయాలని భావిస్తోంది.

Read Also: Telangana: నేటి నుంచి ఒంటిపూట బడులు.. మధ్యాహ్నం 12.30 వరకే

ఇక WPL 2025 సీజన్‌లో గ్రూప్ దశలో రెండు జట్ల మధ్య రెండు మ్యాచ్‌లు జరిగగా, ఈ రెండు మ్యాచ్‌లలో మెగ్ లానింగ్ జట్టు ఢిల్లీ జట్టు హర్మన్‌ప్రీత్ జట్టు ముంబై పై విజయం సాధించింది. హెడ్-టు-హెడ్ రికార్డులో ఢిల్లీ 7 మ్యాచ్‌ల్లో 4 గెలిచింది అలాగే ముంబై 3 గెలిచింది. ఈ విధంగా చూస్తే ఢిల్లీదే పైచేయి. చుడాలిమరి ఈసారైనా ఢిల్లీ గెలిచి తన మొదటి ట్రోఫీ అందుకుంటుందో లేక.. ముంబై మరోసారి ఛాంపియన్స్ గా నిలుస్తుందో.

మ్యాచ్ సాయంత్రం 7 గంటలకు టాస్‌తో ప్రారంభమవుతుంది. ఈ మ్యాచ్ రాత్రి 7:30 గంటలకు ప్రారంభమవుతుంది. మ్యాచ్ ను స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్‌లో టీవీలో ప్రత్యక్ష ప్రసారంలో వీక్షించగలరు. అలాగే JioHotstar యాప్ వెబ్‌సైట్‌లో కూడా లైవ్ ఉంటుంది.