NTV Telugu Site icon

WPL 2025 Auction: ముగిసిన మినీ వేలం.. ఖరీదైన ప్లేయర్‌గా సిమ్రాన్

Wpl 2025 Auction

Wpl 2025 Auction

WPL 2025 Auction: ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (WPL) 2025 కోసం జరిగిన వేలం ముగిసింది. బెంగళూరులో ఆదివారం 19 మంది ఆటగాళ్ల అదృష్టం మెరిసింది. మొత్తం ఐదు ఫ్రాంచైజీలు మూడవ సీజన్‌లో ఒకే సంఖ్యలో స్లాట్‌లను ఖాళీగా ఉన్నాయి. ఈ జట్లు 18 మంది ఆటగాళ్లతో కూడిన జట్టును సిద్ధం చేశాయి. వేలంలో సిమ్రాన్ షేక్ అత్యధికంగా రూ.1 కోటి 90 లక్షలు దక్కించుకుంది. ఆమెను గుజరాత్ జెయింట్స్ కొనుగోలు చేసింది. అన్‌క్యాప్డ్ జి. కమలినిని ముంబై ఇండియన్స్ 1 కోటి 60 లక్షలకు కొనుగోలు చేసింది.

Also Read: Syed Mushtaq Ali Trophy: మరోమారు ఛాంపియన్‌గా ముంబై

ఇకపోతే వేలంలో కొనుగోలు చేసిన 19 మంది ఆటగాళ్ల వివరాలు ఇవే..

* డియాండ్రా డాటిన్ (వెస్టిండీస్) – గుజరాత్ జెయింట్స్ – రూ.1.70 కోట్లు

* నాడిన్ డి క్లెర్క్ (దక్షిణాఫ్రికా) – ముంబై ఇండియన్స్ – రూ. 30 లక్షలు

* జి కమలిని – ముంబై ఇండియన్స్ – రూ. 1.60 కోట్లు

* సిమ్రాన్ షేక్ – గుజరాత్ జెయింట్స్ – రూ. 1.90 కోట్లు

* నందిని కశ్యప్ – ఢిల్లీ క్యాపిటల్స్ – రూ. 10 లక్షలు

* ప్రేమ రావత్ – ఆర్‌సిబి – 1.20 కోట్లు

* ఎన్ చర్నాని – ఢిల్లీ క్యాపిటల్స్ – రూ. 55 లక్షలు

* ఆరుషి గోయల్ – యూపీ వారియర్స్ – రూ. 10 లక్షలు

* క్రాంతి గౌర్ – యూపీ వారియర్స్ – రూ. 10 లక్షలు

* సంస్కృతి గుప్తా – ముంబై ఇండియన్స్ – రూ. 10 లక్షలు

* జోషిత VJ – ఆర్‌సిబి – రూ. 10 లక్షలు

* సారా బ్రైస్ (SCO) – ఢిల్లీ క్యాపిటల్స్ – రూ. 10 లక్షలు

* అలనా కింగ్ (ఆస్ట్రేలియా) – యూపీ వారియర్స్ – రూ. 30 లక్షలు

* రాఘవి బిస్త్ – ఆర్‌సిబి – రూ. 10 లక్షలు

* జాగర్వి పవార్ – ఆర్‌సిబి – 10 లక్షలు

* నిక్కీ ప్రసాద్ – ఢిల్లీ క్యాపిటల్స్ – రూ. 10 లక్షలు

* అక్షితా మహేశ్వరి – ముంబై ఇండియన్స్ – రూ. 20 లక్షలు

* డేనియల్ గిబ్సన్ (ఇంగ్లండ్) – గుజరాత్ జెయింట్స్ – రూ.30 లక్షలు

* ప్రకాశిక నాయక్ – గుజరాత్ జెయింట్స్ – రూ.10 లక్షలు.

ఇక ఈ ఆటగాళ్లను కొనుగోలు చేసినా అన్ని ఫ్రాంఛైజీల వద్ద మిగిలిన పర్స్ మిగిలి ఉంది. ఇందులో భాగంగా.. ఢిల్లీ క్యాపిటల్స్ వద్ద రూ. 1.65 కోట్లు, గుజరాత్ జెయింట్స్ వద్ద రూ. 40 లక్షలు, ముంబై ఇండియన్స్ వద్ద రూ. 45 లక్షలు, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వద్ద 1.75 కోట్లు, యూపీ వారియర్స్ వద్ద రూ. 3.4 కోట్లు మిగిలి ఉన్నాయి.

Show comments