NTV Telugu Site icon

WPL 2024 Final: నేడే డబ్ల్యూపీఎల్‌ 2024 ఫైనల్‌.. కొత్త విజేత ఎవరో!

Wpl 2024 Final

Wpl 2024 Final

WPL 2024 Final Match DC vs RCB Playing 11: మహిళల ప్రీమియర్‌ లీగ్‌ (డబ్ల్యూపీఎల్‌) రెండో సీజన్‌ ఆఖరి అంకానికి చేరింది. ఆదివారం జరిగే ఫైనల్లో ఢిల్లీ క్యాపిటల్స్‌, రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు జట్లు తలపడనున్నాయి. గతేడాది తుది పోరులో ముంబై ఇండియన్స్‌ చేతిలో ఓడిన ఢిల్లీ ఈ సారి కప్పు వదలకూడదనే లక్ష్యంతో ఉంది. ఎలిమినేటర్‌లో డిఫెండింగ్‌ ఛాంపియన్‌ ముంబైకి షాకిచ్చిన బెంగళూరు.. తుది పోరులోనూ అదే జోరు కొనసాగించాలని చూస్తోంది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో రాత్రి 7.30 గంటలకు మ్యాచ్ ఆరంభం కానుంది. ఈ మ్యాచ్ స్పోర్ట్స్‌–18లో ప్రత్యక్ష ప్రసారం కానుంది.

ముంబైని వరుసగా రెండు మ్యాచ్‌ల్లోనూ ఓడించిన బెంగళూరు.. ఫైనల్ మ్యాచ్‌లో ఢిల్లీని ఓడిస్తే టైటిల్‌ కైవసం చేసుకోవచ్చు. అయితే టాపార్డర్‌ వైఫల్యం బెంగళూరును కలవరపెడుతోంది. గత రెండు మ్యాచ్‌ల్లో ఎలీస్‌ పెరీ బాగా ఆడింది. స్మృతి మంధాన, సోఫీ మోలినెక్స్, సోఫీ డివైన్‌లు కూడా రాణిస్తే బెంగళూరు భారీ స్కోరు సాధిస్తుంది. ప్రధాన బౌలర్‌ రేణుకా సింగ్‌ ఈ మ్యాచ్‌లో సత్తా చాటాల్సిన అవసరముంది. శ్రేయాంక, ఆశ శోభన, పెరీ, మోలినెక్స్‌లు రాణిస్తుండటం జట్టుకు కలిసొచ్చే అంశం.

గతేడాది రన్నరప్‌గా సరిపెట్టుకున్న ఢిల్లీ ఈ సారి ట్రోఫీనే లక్ష్యంగా ఆరంభం నుంచి శ్రమించింది. పాయింట్ల పట్టికలో అగ్ర స్థానంతో నేరుగా ఫైనల్‌కు దూసుకొ చ్చిన ఢిల్లీ.. భారీ స్కోర్లతో విరుచుకుపడుతోంది. బెంగళూరుతో తలపడిన రెండు మ్యాచ్‌ల్లోనూ భారీ స్కోర్లు చేసే గెలిచింది. లానింగ్, షఫాలీ, జెమీమా, క్యాప్సీలు సూపర్‌ ఫామ్‌లో ఉన్నారు. బౌలింగ్‌లో మరిజన్, శిఖా పాండే, జెస్‌ జొనాసెన్‌లు రాణిస్తున్నారు. ఢిల్లీని ఆపాలంటే బెంగళూరు శ్రమించాల్సిందే. అరుణ్‌ జైట్లీ స్టేడియం బౌలర్లకు అనుకూలించనుంది. ఇక్కడ బ్యాటర్లు శ్రమించాలి. మ్యాచుకు వర్ష సూచన లేదు.

Also Read: Mirnalini Ravi : విజయ్ ఆంటోనీ రొమాన్స్ బాగా చేసారు..

తుది జట్లు (అంచనా):
ఢిల్లీ: మెగ్‌ లానింగ్‌ (కెప్టెన్‌), షఫాలీ వర్మ, అలైస్‌ క్యాప్సీ, జెమీమా రోడ్రిగ్స్, మరిజన్‌ కప్, జెస్‌ జొనాసెన్, అరుంధతి, రాధా యాదవ్, మిన్నుమణి, తానియా, శిఖాపాండే.
బెంగళూరు: స్మృతి మంధాన (కెప్టెన్‌), సోఫీ డివైన్, ఎలీస్‌ పెరీ, దిశా కాసత్, రిచా ఘోష్, సోఫీ మోలినెక్స్, వేర్‌హమ్, శ్రేయాంక, ఆశ శోభన, శ్రద్ధ, రేణుకా సింగ్‌.

 

Show comments