Mirnalini Ravi : విజయ్ ఆంటోనీ రొమాన్స్ బాగా చేసారు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
యాక్షన్ రోల్స్ లో ఎక్కువగా అలరించిన విజయ్ ఆంటోని ఇప్పుడు లవర్ బాయ్ గా అలరించబోతున్నాడు.. బిచ్చగాడు వంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత విజయ్ అంటోని లవ్ గురు సినిమాతో ప్రేక్షకులు ముందుకు రాబోతున్నాడు.ఇప్పటి వరకు విజయ్ సీరియస్ రోల్స్ లో ఎక్కువగా కనిపించాడు. కానీ మొదటి సారి ‘లవ్ గురు’లో లవర్ బాయ్ గా మెప్పించనున్నాడు.. ఈ చిత్రంలో విజయ్ ఆంటోని సరసన ‘గద్దలకొండ గణేష్’ మూవీ ఫేం మృణాళిని రవి హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా రంజాన్ పండుగ సందర్భంగా ఏప్రిల్ 11న విడుదల కాబోతుంది. ఈ నేపథ్యంలో మూవీ టీం ప్రమోషన్స్ మొదలు పెట్టింది.ఈ క్రమంలో చిత్ర యూనిట్ తాజాగా ప్రెస్మీట్ నిర్వహించి మూవీ విశేషాలను పంచుకున్నారు. ఈ సందర్భంగా హీరోయిన్ మృణాళిని మాట్లాడుతూ.. ఎప్పుడు సీరియస్ గా కనిపించిన విజయ్ ఆంటోని గారిని ఈ చిత్రంలో సరికొత్తగా చూడబోతున్నారన్నారు.
ఈ సినిమాలో ఆయన రొమాన్స్ బాగా చేశారంటూ విజయ్ ఆంటోనిపై సరదా కామెంట్స్ చేశారు. “విజయ్ ఆంటోనీని ఇప్పటివరకు సీరియస్ గా చూశారు. లవ్ గురులో మీరు సరికొత్త విజయ్ ఆంటోనిని చూడబోతున్నారు. మొదటిసారి ఆయన రొమాంటిక్ గా కనిపించబోతున్నారు. ఈ సినిమాలో ఆయన రొమాన్స్ బాగా చేశారు. ఈ మూవీ తర్వాత ఆయనకు లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిపోతుంది. అంతేకాదు లవ్, రొమాంటిక్ స్క్రిప్ట్స్ ఆయనకు క్యూ కట్టిన ఆశ్చర్యపోనవసరం లేదు.ఇక షూటింగ్ టైమ్ లో ఆయనను నేను లవ్ గురులా భావించి సలహాలు తీసుకునేదాన్ని. సెట్లో నా బ్రేకప్ స్టోరీస్ ఆయనకు సరదాగా చెప్పేదాన్ని. ఇలా విజయ్ గారితో షూటింగ్ మొత్తం ఫన్ గా సాగింది. లీలాగా నా పాత్ర మిమ్మల్ని ఎంతగానో ఆకట్టుకుంటుందని అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ పాత్ర కోసం నేను కలైరాణి మేడం దగ్గర స్పెషల్ ట్రైనింగ్ తీసుకున్నాను. తన సలహాలు, సూచనలు నాకు బాగా ఉపయోగపడ్డాయి” అని చెప్పుకొచ్చారు.
Also Read
- Philippines-China: వేదికపై ఉండగా చైనా వార్నింగ్.. ఫిలిప్పీన్స్ రక్షణ మంత్రి ఏం చేశారంటే..!
- Central Cabinet Decision: తెలుగు రాష్ట్రాల్లో 4 లేన్ల రైల్వే ట్రాక్‌లు.. కేంద్ర కేబినెట్ నిర్ణయాలు ఇవే!
- Supreme Court: సీజేపీ నిరసనకారుడికి నోటీసు.. ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్‌పై సుప్రీంకోర్టు ఆగ్రహం
- YS Jagan: గట్టిగా పోరాడదాం.. జరిగేది కురుక్షేత్ర సంగ్రామం.. స్థానిక సంస్థల ఎన్నికలపై జగన్ కీలక వ్యాఖ్యలు!
తాజావార్తలు
-
Oppo A7 Pro 5G: ఒప్పో A7 Pro 5G లాంచ్.. 8,000mAh బ్యాటరీ, 120Hz డిస్‌ప్లే, 50MP కెమెరా
-
Ranabaali Teaser: రణబాలి టీజర్లో విజయ్ విశ్వరూపం.. బ్రిటిష్ కాలం నాటి చీకటి కథతో సినిమా!
-
Philippines-China: వేదికపై ఉండగా చైనా వార్నింగ్.. ఫిలిప్పీన్స్ రక్షణ మంత్రి ఏం చేశారంటే..!
-
Trade War: అమెరికాపై యుద్ధం ప్రకటించిన పొరుగుదేశం! అగ్రరాజ్యం వస్తువులపై 50% టారిఫ్..
-
AI Danger Warning: Anthropic పరిశోధకుడు రాజీనామా.. షాకింగ్ వార్నింగ్.. ఈ దశాబ్దం చివరికి AIతో మానవాళికి ముప్పు?
ట్రెండింగ్
-
Sweet Atukulu Recipe: వినాయక చవితి స్పెషల్.. కరకరలాడే అటుకుల తీపి ప్రసాదం.! సులువుగా చేసుకోండి ఇలా..
-
Moringa Leaf Powder: రోగనిరోధక శక్తిని పెంచి, బెల్లీ ఫ్యాట్ తగ్గించే సూపర్ రెసిపీ.. ‘మునగాకు పొడి’.! ఇంట్లోనే సులువుగా చేసేయండి ఇలా..
-
SSC CHSL 2026: 12వ తరగతి అర్హతతో 2,536 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. రూ.92,300 వరకు జీతం..!
-
ఒక్క ఛార్జ్‌తో 132 కి.మీ రేంజ్..! Kinetic DX Plus 3.1kWh వేరియంట్ లాంచ్..!
-
Range Rover SVకి మరింత లగ్జరీ టచ్.. కొత్త డ్యూయల్-టోన్ పెయింట్ ఫినిష్ వచ్చేసింది.!