NTV Telugu Site icon

Smriti Mandhana : కెప్టెన్ గా పనికిరాదు?.. స్మృతి మంధాన అసంతృప్తి..!

Smiriti Mandhana

Smiriti Mandhana

టీమిండియా మహిళల క్రికెట్ లో ఒక సంచలనంగా మారిన స్మృతి మందానపై ఇప్పుడు విమర్శలు వస్తున్నాయి. దూకుడైన ఆటతీరుకు నిర్వచనంగా చెప్పుకునే మంధాన బీసీసీఐ నిర్వహించిన తొలి మహిళల ప్రీమియర్ లీగ్ లో మాత్రం నిరాశజనక ప్రదర్శన చేసింది. పైగా స్టార్ క్యాంపెయినర్ హోదా కట్టబెట్టి వేలంలో ఆర్సీబీ ఫ్రాంఛైజీ మంధానను భారత జట్టులో అందరికంటే ఎక్కువగా రూ. 3.40కోట్లు గుమ్మరించి కొనుగోలు చేసింది. అంతేకాదు. ఏదో చేస్తుందని ఆమెకు కెప్టెన్ గా కూడా ఎంపిక చేసింది.

Also Read : Ukraine: ఉక్రెయిన్ లో జపాన్ ప్రధాని కిషిడా ఆకస్మిక పర్యటన

మంధాన ఇలా కెప్టెన్ అయిందో లేదో ఒత్తిడిలో పడి బ్యాటర్ గా, కెప్టెన్ గా పూర్తిగా విఫలమయ్యింది. కెప్టెన్ గా అనుభవలేమి ఆమెలో కొట్టొచ్చినట్లు కనిపించింది. ఆర్సీబీ కెప్టెన్ గా వరుసగా ఐదు మ్యాచ్ ల్లో ఓటములు చవిచూసిన మంధాన బ్యాటర్ గానూ పూర్తిగా విఫలమైంది. ఒక్క హాఫ్ సెంచరీ కూడా నమోదు చేయని ఈమె ఎనిమిది మ్యాచ్ ల్లో 18.6 సగటుతో కేవలం 149 పరుగులు మాత్రమే చేసింది. ఇక కెప్టెన్ గానూ ఆమె అంతగా సక్సెస్ కాలేకపోయింది. సోఫీ డివైన్ వల్ల ఒక మ్యాచ్.. రిచా ఘోష్ వల్ల మరొక మ్యాచ్ గెలిచిన ఆర్సీబీకి కెప్టెన్ గా మంధాన చేసిందేమీ లేదు.. అందుకే వచ్చే సీజన్ లో మంధానను కెప్టెన్సీ నుంచి తప్పిస్తే మంచిదని చాలా మంది అభిప్రాయపడ్డారు.

Also Read : Pakistan: పాకిస్తాన్ టాప్ ఇంటెలిజెన్స్ అధికారి హతం..

డబ్య్లూపీఎల్ లో కెప్టెన్ గా నిరాశపరిచిన మంధాన భవిష్యత్ లో టీమిండియా వుమెన్ కెప్టెన్ గా ఎంపికయ్యే అవకాశాలను కూడా పోగొట్టుకుంది. కెప్టెన్సీ ఒత్తిడి లేకపోతేనే ఆమె బాగా ఆడుతుంది అన్న ముద్రను మరింత సుస్థిరం చేసుకుంది. ఇన్నాళ్లు డబ్య్లూపీఎల్ లో కెప్టెన్ గా, బ్యాటర్ గా విఫలమైన మంధాన తాజాగా బౌలింగ్ లోనూ దారుణ ప్రదర్శన చేసింది. రాక రాక బౌలింగ్ కు వచ్చిన ఆమె ముంబై ఇండియన్స్ తో మ్యాచ్ లో ఒకే ఒక్క ఓవర్ వేసిన మంధాన అది పూర్తిగా వేయలేకపోయింది. ఐదు వైడ్లు వేసి ప్రత్యర్థి జట్టును గెలిపించింది. కేవలం మూడు బంతులు మాత్రమే వేసిన ఆమె మిగతా ఐదు బంతులు వైడ్లు వేయడం గమనార్హం. ఇక మంధానను విరాట్ కోహ్లితో కొంతమంది పోల్పారు. కోహ్లీ తన తొలి ఐపీఎల్ సీజన్ లో ఒక్క హాప్ సెంచరీ చేయలేకపోయాడు. ఆ తర్వాత సీజన్ నుంచి మాత్రం దుమ్మరేపే ప్రదర్శనతో సుస్థిరంగా పరుగులు సాధిస్తూ వచ్చాడు. మంధాన కూడా కోహ్లీ లాగే తొలి సీజన్ లో విఫలమైంది.. మలి సీజన్ నుంచి మాత్రం తన బ్యాటింగ్ పనర్ చూపిస్తుందని ఆమె అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

Show comments